Pages

27 March 2016

బేకారీలు 20-25

20
అతను పిల్లాడు కొన్నిసార్లు
అన్నాన్నేను ఆదరంగా

నా కెప్పటికి పసిపిల్లాడే అందామె
ఓ రాఖీ కట్టి, అనుభూతిని హత్తుకుంటూ.

21
స్వీయ ప్రమేయాల కంటే
పర ప్రభావాలు మరింత ప్రతిభావంతంగా
పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పుడు
ఆటోమాటిగ్గా ఆరాధన మొదలైపోతుంది.
310815

22
అతనన్నాడు,
నువ్వెప్పుడన్నాఅక్షరాలను,
ప్రేమతో హత్తుకొన్నావా అని.

అక్షరాలు సీతాకోకలు
పట్టుకోకూడదు.
స్వేచ్ఛగా ఎగరనీవాలంటూ
నవ్విందామె.
130915


23
రెండు దేహాల మధ్య
రహాస్యాలేం మిగల్లేవ్.
కొద్ది సేపటి తర్వాత.

అంతులేని అన్వేషణనను
ఆరాధించే సాహసికుడు
మనసుతోనే రమిస్తాడు.

జీవితకాల శోధన కదా అది.


24
ఇంకా తొలగని
దిగులుతెర చాటునుంచి,
అతనడిగాడు,
ఇదంతా ముందే చెప్పచ్చు కదా.

ఆరోపణ నా అజ్ఞానచిత్రం
నువ్వే తెలుసుకోవడం
నీ జ్ఞానదృశ్యం.
అంటూ ఓదార్పుగా నవ్విందామె.
150915


25
ప్రేమంటే ముందుకెళ్లడం,
ధ్వేషమంటే వెనక్కిమళ్లటం.
అన్నాడతను
కాస్తంత  తాత్వికంగా.

జీవితమంటే
ముందనెకల ఊగిసలాటే
అందామె అలై అల్లుకుంటూ.


230915

No comments:

Post a Comment