Pages

27 March 2016

బేకారీలు 6-10

6
కొన్ని సందర్భాలు కావాలి.
మనుషుల్ని అర్థం చేసుకోవడానకి.

ఎంత త్వరగా వస్తే అవి
అంత సంతోషించు
ఇంకా, చాలా దూరం నడవనందుకు.
061015
7
కాష్టపు సెగ కూడా
చలి మంటే కదా

వెచ్చదనాన్నే నువ్
ఆస్వాదించేటప్పుడు.

8
ఒక ఉద్రేక పూరిత స్వభావం చేత
నిరంతర ఆలోచనల చేత
అంతులేని అన్వేషణా జ్ఞానం చేత
అసంతృప్త వేదన చేత
తిరిగి, తిరిగి

చివరికి అక్కడికే చేరుకుంటాం,
ఎక్కడ బయల్దేరామో అదే స్థానానికి.

లోకం నడుస్తూనే వుంటుంది.
మళ్లీ మనల్ని కలుపుకొని.


9
అదే పనిగా
అసాధారణాన్ని ఆశించకు.

జీవితం
సాధారణంగా సాగడమే
ఓ అసాధారణ అదృష్టం.
051015

10
ఈ ఒక్కటి చాలు కదా
ఇన్నెన్ని
రాయడమెందుకందామె
హత్తుకుంటూ.

ఈ ఒక్కదానికోసమేకదా,
అన్ని రాసిందని,
నవ్వుకున్నాను నేను.


No comments:

Post a Comment