1
బయట
కొట్లాటల దీపం
ఆరిపోయింది.
లోపల
పోరాటాల ప్రమిదను
వెలిగించుకున్నాక
2
ఉక్కపోతల
ప్రయాణాల్లో
ఉక్కిరి
బిక్కిరయ్యే తొలకరులు
విడిపోతలైనాక,
మొదలయ్యే
తలపోతల్లో
జ్ఞాపకం
రాసే మెరుపు రాతలు
పెదలపై పై
పూసే నవ్వుల పూతలు.
111015
3
అక్షరానికి
ధ్వేషం తెలయకపోవచ్చు.
భావం చేత
అది సమరానికి
బీజమై మొలకెత్తుత్తుంది.
071015
గమనిక
ధ్వేషం - సమరం, స్థానంలో ప్రేమ - ప్రణయం ఇంకా ఏమైన ఆప్ట్ జంటలను చేర్చుకోని చదువుకోగలరు.
4
పుప్పొడి ప్రయాణంలో
అది ఫలిస్తేనే కదా !
ఓ కొత్త జీవితాన్ని
మళ్లా రాసుకునేది.
221015
5
వంటరిగా
వదిలేయ్,
జీవితార్థాన్ని
వెతుక్కోవాలి.
అన్నాడతను,
దూరంగా నడుస్తూ.
జీవితం
వాక్యంలో
అక్షరం లాంటిది.
కలవకుండా
అర్థాన్ని అన్వేషించలేవ్,
విలువను
ఆపాదించుకోలేవ్
నీకు
తెలుసు కదా
అయిదు
మందిని
వెతుక్కున్నాకే,
గౌతముడు,
బుద్దుడై వెలిగిన సంగతంటూ,
ఓ
రెండక్షరాల వాక్యమైంది ఆమె.
091015
No comments:
Post a Comment