Pages

2 April 2012

అవీ ఇవీ - 2

          ఏప్రిల్ 2,  అంతర్జాతీయ బాలల పుస్తకాల రోజు.

  పిల్లల కు పుస్తకాలు   చదవ టంలోని ఆనందాన్ని తెలియచేయటం, జీవితం లో స్పూర్తి నిచ్చే పుస్తకాలను పరిచయం చేయడం ఈ రోజు యొక్క 
ప్రధాన ఉద్దేశ్యం.
"చినిగిన చొక్కా ఐనా తొడుక్కో , మంచి పుస్తకం కొనుక్కో"
"అక్షర రూపం దాల్చిన ఒక్కో సిరా చుక్కా,
లక్షల మెదళ్ల కదలిక "
లాంటి మంచి మాటల్ని పిల్లలకు తెలియ చేయాలి 

  The Little Mermaid Story.,  The Ugly Duckling  , 
The Nightingale  వంటి అనేక ప్రముఖ పిల్లల కథల రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్  యొక్క పుట్టినరోజుకు గుర్తుగా International childrens books day గా జరుపుకుంటున్నాము.

అందరికీ   హ్యారీ పాటర్,  గలివర్స్ ట్రావెల్ వంటి రచనలు బాగా తెలుసు.  మనకు  అద్భుతమైన పిల్లల పుస్తకాలు పంచతంత్రం,తెనాలి రామలింగని కథలు, పేదరాసి పెదమ్మ కథలు వంటివి ఎన్నో  లభిస్తున్నాయి. చందమామలు, బాలమిత్రలు, బుజ్జాయు వంటి పిల్లల పుస్తకాలను కాపాడ వలసిన అవసరం మన పైన వుంది . ఈ పిల్లల పుస్తకాలు,పిల్లలే కాకుండా పెద్దలు కూడా చదువుకునే టట్టు వున్నాయి.

 రోజు స్కూల్ బుక్స్ చదువుతాం.  అవి కాకుండా మంచి పుస్తకాలు చదవడానికి   ప్రయత్నించండి, అంతర్జాతీయ బాలల బుక్ డే  సందర్భముగా ఈరోజు నుండికనీసం  నెలకు
 ఒక   మంచి పుస్తకాన్ని చదివే అలవాటు చేసుకోండి.

promote book culture, 
stop the look culture ( watching tv)

No comments:

Post a Comment