Pages

20 July 2012

శిష్ ట్లా ఉమా మహేశ్వరరావుగారి వెన్నెల గీతం



ఇటు వెన్నెల      అటు వెన్నెల
నడి శిరస్సుకు  శ్రీ వెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
చిరునవ్వుల  కలవెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
విరులల్లిన  జడవెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
చెంగల్వల జిగి వెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
ఈశ్వరునికి  తలవెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
ఆకాశము మొల వెన్నెల
ఇటు వెన్నెల         అటు వెన్నెల
మనసుల్లో  మరువెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
ఎటు చూచిన కనువెన్నెల

ఇటు వెన్నెల అటు వెన్నెల
పిచ్చెత్తే, వళ్ళంతా వెర్రేత్తే
దిక్కులకై పరుగెత్తే నా మనసున,
వెన్నెల్లో ప్రేయసి లేక,
అమావాస్య అమావాస్య అమావాస్య
మహాలయ అమావాస్య .

(నవకవితకు ఆద్యుడు, విస్మరించబడ్డ గొప్ప కవి శిష్ ట్లా ఉమా మహేశ్వరరావుగారి గీతం ఇది,1938 లో ప్రచురించిన విష్ణుధనువు కవితా సంకలనం నుంచి. కవి పరిచయం తరువాతి టపాలలో చేస్తాను.)


6 comments:

  1. ప్రేరణ గారు , ఈ రోజున మనమిలా స్వేచ్ఛగా కవిత్వం రాస్తున్నామంటే,అది ఆయన వేసిన మార్గమే, శ్రీశ్రీ కూడా శిష్ట్ లా ప్రేరణతో, ఆ తోవలో నడిచినవాడే, ఆయన్ను స్మరించుకోవడం, నా అదృష్టమే. ధన్యవాదాలు మీకు.

    ReplyDelete
  2. వెన్నెలా వెన్నెలా అన్నారు కాబట్టి ఈ గీతం బాగుంది. మీరు రాయలేదు కదా అందుకు కూడా అనమాట.. సరదాగా అన్నాను. బాగుంది వెన్నెల గీతం

    ReplyDelete
    Replies
    1. వెన్నల గారికి ఓ గీతం అని రాయల్సిందండి. ha, ha,
      మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  3. bbagundi vennela ggeetam..
    maaku vennela panchinanduku
    dhanyavaadaalu bhaskar gaaroo!
    @sri

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు మీ అభినందనలకు ధన్యవాదాలు. మనం మరిచిన ఒక కవిని గుర్తు చేయడానికే అండి, ఈ గీతం.

      Delete