Pages

29 July 2012

అంతర్జాలం-మాయాజాలం,ద్విపదలు



అంతర్జాలం, ప్రపంచమే కుగ్రామం.
మాయాజాలం, పక్కిల్లే, మరో ప్రపంచం.
 ---------------------
నెట్ లో నానీలు పెట్టు.
చదివే చేపల్ని, జల్లించి పట్టు.
---------------------------
పక్కంటోడిని పలకరించడు కాని,
అజ్ఞాత అమెరికన్తో, గంటల కొద్ది చాటింగ్.
--------------------------
రాకుమారుడు, గుర్రం పై లోకసంచారం.
పకపకమంది, బ్రౌజింగ్ ఎలుక.

15 comments:

  1. చాలా బాగుంది అండీ..
    అంతా అంతర్జాల మాయాజాలమే..

    (ఈ బ్లాగులు, కామెంటులు అన్నీ దాని మాయేకదా..!!)

    ReplyDelete
    Replies
    1. సాయి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.
      ఈ కవితలు కూడా నండి,

      Delete
  2. అంతర్జాలం మనం మిత్రులయ్యేందుకు ఉపయోగపడింది భాస్కర్ గారూ!
    ఏమంటారు?..:-))
    బాగా వ్రాసారు..
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.ఇంత మంది మిత్రులు అంతర్జాల ఫలమే కదండి, నిజమే.

      Delete
  3. నిజమే కదా:-)

    ReplyDelete
    Replies
    1. చిన్ని గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు. true one.

      Delete
  4. ఏంటో అంతా మాయాజాలం:)

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకు ధన్యవాదాలు.హ,హ, అంతేనేమోకదండి, ప్రేరణ గారు,

      Delete
  5. అంతర్జాలమే మన బేస్ కదండి:)

    ReplyDelete
    Replies
    1. అనికేత్ గారు, నా బ్లాగు కు సుస్వాగతం, మీరన్నది కూడా నిజమే, కానీ జీవితానికి కాదేమో.

      Delete
  6. ప్రపంచాన్ని కుగ్రామం చేసిన అంతర్జాలం..చాలా బావుంద౦డీ..

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారికి, నా బ్లాగు కి సుస్వాగతం అండి,
      మీ అభినందనలకు ధన్వవాదాలు.

      Delete
  7. "పక్కిల్లే, మరో ప్రపంచం."
    అంతర్జాలం మయాజాలం గురించి బాగా చెప్పారండీ..

    ReplyDelete
  8. హ,హ,.....రాజీ గారు, మీ అభినందనలకు ధన్వవాదాలు. పక్కిల్లే మరో ప్రపంచం , నాక్కూడా నచ్చిందండి.

    ReplyDelete