Pages

25 July 2012

తెలుగు బ్లాగుల గీతం.(బ్లాగర్లకు మాత్రమే )




మా బ్లాగులమ్మకు లక్ష పూలాజల్లు
మన తెలుగు బ్లాగుకు నీరాజనాలు.
తెలుగు బ్లాగుల వృధ్ది  - మన భాష అభివృధ్ది
మనందరీ బుద్ది – కదలాలి అటు కొద్ది.
                                                        మా బ్లాగులమ్మకు...
ఎక్కడెక్కడి తెలుగు – ఇచటికే పరుగు
మన భాష వెలుగు – బ్లాగులతో పెరుగు.
చిన్నప్పటి కథలు – పెద్దవారి వెతలు
అనుభవపు పాఠాలు – చిలిపి ఆరాటాలు
అన్నిటిని ఇక్కడే వెతుకుతాము
ఎన్నెన్నో విషయాలు హత్తుకొని వెళ్తాము
                                                                 మా బ్లాగులమ్మకు...
బెల్జియం బెజవాడ – ఇంగ్లాండు, గుడివాడ
అమెరికా, మెక్సికో – దుబాయి,ముంబాయి
సఖినేటిపల్లి – ఆఫ్రికాలో పల్లి
కలకత్త, కనిగిరి – ఎచ్చోట మేమున్నా
                                                           మా బ్లాగులమ్మకు...
కలల ఊహల ఊట – సాహిత్య పూతోట
భావాల జడివాన - కురిసేను ఇచ్చోట
ఆకట్టు పోస్టులు - అలరించు కామెంట్లు
ఈ బ్లాగులా పంట - పండాలి ప్రతి ఇంట
                                                        మా బ్లాగులమ్మకు...
అపురూప కవితలు , చక్కని చిత్రాలు
సినిమాలు, గీతాలు, రాజకీయాలెన్నో
కళలు, విజ్ఞానాలు, కమనీయ విషయాలు
యాత్రవిశేషాలు, విశ్లేషణలు ఎన్నో
                                                         మా బ్లాగులమ్మకు...
తెలుగు భాషా శక్తి - బ్లాగర్ల ధీయుక్తి
విశ్వమంతా ఎగురు - తెలుగు బ్లాగుల కీర్తి
ఈ జీవితం మొత్తమూ ,ఇక బ్లాగులకే అంకితం
బ్లాగులే దైవమూ, బ్లాగులే మా ప్రాణమూ 

జై బ్లాగులమ్మ జై బ్లాగులమ్మ జైబ్లాగులమ్మ

సూచనలు
1. ప్రతి బ్లాగర్ల సమావేశం లో ప్రార్థనా గీతంగా పాడుకోవాలి.

2.తెలుగు బ్లాగుల గీతాన్ని గౌరవించి, ప్రచారం చేయాలి.

3. ఏ ఇద్దరు బ్లాగర్లు కలసినా జై బ్లాగులమ్మ అని అరుచుకోని, అభివాదం చేసుకోవాలి.

24 comments:

  1. Replies
    1. శ్యామలీయం గారికి, మీ ఆశ్చర్యానికి,, ధన్యవాదాలండి.

      Delete
  2. భాస్కర్ గారు.... కెవ్వ్వ్ కేక అండీ....
    భలే రాసారు అండీ...

    ( పై సూచనలు పాటించడానికి నా సాయ శక్తుల ప్రయత్నిస్తానని, ఎట్టి పరిస్ధితులలోనైనా వాటిని మీరిపోననీ మన "బ్లాగు ప్రతిజ్ఞ" సాక్షిగా చెప్పుచుంటిని.. )
    జై బ్లాగులమ్మ జై బ్లాగులమ్మ...

    ReplyDelete
    Replies
    1. సాయిగారు, కెవ్వుకేక లాంటి వ్యాఖ్య, జై బ్లాగులమ్మ.

      Delete
  3. జై బ్లాగులమ్మ జై జై బ్లాగులమ్మ..
    బాగుందండీ :)
    సాయి గారి మాటే నాది కూడా...!!

    ReplyDelete
    Replies
    1. సీతగారు, మీ అభినందనలకు ధన్యవాదాలు, జై బ్లాగులమ్మ.

      Delete
  4. :):)ఇలా ఉండటం కష్టమేమో అండీ :) జై బ్లాగులమ్మ

    ReplyDelete
    Replies
    1. మీరు మరి రసజ్ఞగారు, మనం పాడిన పాటలలోలాగా, ప్రతిజ్ఞలోలాగా, అప్పుడప్పుడు మాట్లాడిన మాటలలో లాగా వుంటే ప్రపంచం నాశనం అయిపోదటండి. హి, హి,... , జై బ్లాగులమ్మ

      Delete
  5. భాస్కర్ గారూ!
    ఇంతకు ముందు ప్రతిజ్ఞ అన్నారు...
    ఇపుడు పాట అంటున్నారు...
    మేమంతా కవితలతో..వ్యాసాలతో..కథలతో అందర్నీ ఇబ్బంది పెట్టేస్తుంటే...
    మీరు ఇలా ప్రతిజ్ఞలు, పాటలతో ఇబ్బంది పెట్టేస్తే ఎలా???...:-)))...:-)))
    @శ్రీ :-)

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు, మొత్తం మీద అందరిని ఇబ్బంది పెట్టేస్తున్నామని ఒప్పుకుంటున్నాం కదా,ఇక పాట అయితే ఏంటి, కవితైతే ఏంటి, హ,హ, ,... , జై బ్లాగులమ్మ

      Delete
  6. జై బ్లాగులయ్యకు అనొచ్చుగా బ్లాగులమ్మ అనే బదులు :-)

    ReplyDelete
    Replies
    1. చిన్ని గారికి, క్షేత్రం ఎప్పుడు అమ్మేనేమోనండి.
      భూమాతే, తెలుగుతల్లే, బ్లాగులమ్మే తిరుగేలేదు, జై బ్లాగులమ్మ జై బ్లాగులమ్మ
      ha, ha, ha.

      Delete
  7. చాలా బ్లాగుంది భాస్కర్ గారూ ! :))

    ReplyDelete
    Replies
    1. పల్లా కొండలరావు గారికి, నా బ్లాగు కి సుస్వాగతం అండి,
      మీ అభినందనలకు ధన్వవాదాలు. , జై బ్లాగులమ్మ

      Delete
  8. ఏమయ్యింది మీకు? హాయిగా, చక్కగా నానీలు, కవితలు, అప్పుడప్పుడు అనువాదాలు రాస్తూ ఉండేవారే? ఈ ప్రతిజ్ఞలు, ప్రార్ధనా గీతాలేమిటి? అసలు ఏమయ్యింది మీకు. బ్లాగ్ బగ్ బైట్ (BLOG BUG BITE) లాంటిది ఎమన్నా అయ్యిందా?
    అవేమి కాక, మీరు నిజంగానే ఇష్టపడి ఈ గీతం రాసినటైతే బాగుంది..బాగా రాసారు. జై బ్లాగులయ్య అనే అంటాను నేను కూడా చిన్ని గారిలా!!

    ReplyDelete
    Replies
    1. 1.అసలేమైపోయారండి మీరు, నాలుగు రోజుల నుంచి కామెంట్లు రాయకుండా, ఎలా వుండగలిగారండి, మీరు..., నేనడిగింది వంద రూపాయలే కదా, దానికి కనపడకుండా వుండాలా, 2. ఇష్టపడి రాయడం, కష్టపడి రాయడం వుండదండి, రాయడమే, రెండు రాసింది ఒక రోజే.
      3. బ్లాగేరియా అనేది కొత్తగా వ్యాపిస్తున్న జబ్బు, మీరు జాగ్రత్త. హి,హీ,

      Delete
  9. అరవడం కొంచెం కష్టమైనా మీరింతిలా దబాయించేసరికి అరవాల్సొస్తోంది :):) జై బ్లాగులమ్మ జై జై బ్లాగులమ్మ

    ReplyDelete
    Replies
    1. సుభ గారు , మీ అభిమాన అరుపుకి ధన్యవాదాలు, ఈ సారి ఇష్టం గా అరవండి, ప్లీజ్

      Delete
  10. చచ్చిపోతున్నామురో.. బాబో పంతుళ్ళ చేత ప్రతిజ్ఞలు చేయించే మిమ్మల్ని ఏమనాలి. భాస్కర్ గారూ ఇలా బెత్తం పట్ట్టుకోండి అందరూ వింటారు.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు, ఇప్పుడు బెత్తాలు వద్దన్నారు కదండి,
      అయినా మీరు జై బ్లాగులమ్మ అనలేదు కాబట్టి, రెండు గుంజిళ్లు తీయండి, హ, హ......

      Delete
  11. చెట్టు గారు,
    ఏదీ ఒక్క అజ్ఞాత కూడా 'జై బ్లాగులమ్మ' అనలేదే!? :)
    అజ్ఞాతల్లేని బ్లాగులు, సౌరభములు లేని పుష్పాల చెట్టు వంటివి అన్నాడో కవి. ;)

    ReplyDelete
    Replies
    1. SNKR garu నా బ్లాగు కు సుస్వాగతం, మీ కోసం అజ్ఞాతలకు తలుపులు తెరుస్తున్నానండి,"చెట్టుగారు", ఎంత బాగుందండి, పిలుపు, జై బ్లాగులమ్మ

      Delete
  12. తెలుగు బ్లాగుల గీతం.చాలా బాగుందండీ ..

    "ఏ ఇద్దరు బ్లాగర్లు కలసినా జై బ్లాగులమ్మ అని అరుచుకోని,అభివాదం చేసుకోవాలి."
    ఈ ఆలోచన కూడా బాగుంది :)

    ReplyDelete
  13. రాజీ గారు, మీ అభినందనలకు ధన్వవాదాలు. జై బ్లాగులమ్మ

    ReplyDelete