Pages

11 July 2012

నీతో పాటు, నేను అలానే.........అంతర్ముఖం



చీకటి మూలలలో,
వంటరిగా ఈ ఇరుకిరుకు గదులలో,
ఇక్కడ నువ్వు,
గమ్యాలను గాలికొదిలి,
ఎందుకిలా వృధాగా......
ఒక్కసారైన నీ హృదయాన్ని,
నువ్వు పరికించి చూసుకున్నావా
ఎందుకు నువ్వు నిన్ను,
ఈ కఠిన శృంఖలాల మధ్య,
బంధీగా బంధించుకోని,
నిరంతర మూలుగులతో,
వేధించుకొంటున్నావు,
ఎందుకిలా......
మబ్బులు కమ్ముకొచ్చిన వేళ కూడ,
చినుకుల జీవాన్ని హత్తుకోకుండా.......
పొద్దు పొడిచి, దినమంతా గడిచి,
చీకటి ముసురు కుంటున్న వేళ కూడా,
దీపాన్ని సిద్దపరచలేక.....
దుర్భలము, అనిశ్చయము అయిన,
ఏ దేహంతోనైతే,
నువ్వు గాఢంగా పెనవేసుకొని,
ఏ రమ్యమైన కాంక్షావిపత్తులతో,
అలుపెరుగక రమిస్తున్నవో,
అవేవీ జీవన చైతన్య దీప్తులు కావని,
గొంతెత్తి అరవాలనిపిస్తుంది.
కాని, ఈ చీకట్లలోనే,
నీతో పాటు, నేను అలానే..........

16 comments:

  1. ఏ దేహంతోనైతే నువ్వు గాఢంగా పెనవేసుకొని ఏ రమ్యమైన కాంక్షావిపత్తులతో,
    అలుపెరుగక రమిస్తున్నవో అవేవీ జీవన చైతన్య దీప్తులు కావని గొంతెత్తి అరవాలనిపిస్తుంది.
    చాలా చాలా బాగా రాసారు అండీ.. ఆ లైన్ లోని అర్దం చాలా బాగా నచ్చింది...

    ReplyDelete
  2. Sir adbhthamgaa undi, manchi bhaavaavesam.

    ReplyDelete
  3. చాలా బాగుంది భాస్కర్...
    అభినందనలు మీకు...
    @శ్రీ

    ReplyDelete
  4. చాల బావుంది భాస్కర్! మనసుకుహత్తుకొనేటట్లు వుంది. ముఖ్యం గా ఈ వాక్యాలు లో ని భావం చాల చాల బావుంది
    (ఏ దేహంతోనైతే,
    నువ్వు గాఢంగా పెనవేసుకొని,
    ఏ రమ్యమైన కాంక్షావిపత్తులతో,
    అలుపెరుగక రమిస్తున్నవో,
    అవేవీ జీవన చైతన్య దీప్తులు కావని),

    ReplyDelete
  5. బాగుంది..చాలా బాగుంది..గొప్పగా ఉంది...
    నచ్చింది..కాని కుళ్ళుగా ఉంది..మీదే బాగుంది కవిత :))
    సరదాకి అన్నాను. బాధపడకండే!

    ReplyDelete
    Replies
    1. ha,ha, bhagundi annaaru kada, ika bhdha endukandi,
      konni padaalu chelam githanjali nunchi theesukunnanu, andukani goppaga undemo andi. thank you vennela garu.

      Delete
  6. నాది కూడా వెన్నెల గారి భావమేనండి..-:)

    ReplyDelete
  7. చాలా బావుంది మనసులో నుంచి వచ్చిన భావం కదా ఎందుకో అనిపిస్తోంది మీ కవితలు చూసినప్పుడల్లా అయ్యో నేను ఇలా రాయలేక పోయానే అని....!!

    ReplyDelete
    Replies
    1. thank you manju garu, navi kavithale kavemo ani feeling ventaaduthune untundandi, mee lanti friends bhaagundi annappudu, entha happy ga untundo,
      thank you very much andi.

      Delete
  8. మనసులోతు నుండీ పలికించిన భావం సూపర్...
    భలే నచ్చింది భాస్కర్ గారు :)

    ReplyDelete
    Replies
    1. thank you sitha garu, mee comment inka ledenti ani wait chesaanandi.

      Delete