Pages

30 September 2012

ఓ జీవితానికి సరిపడా కవిత్వం............కిరణ్ గాలి

ఒక్కోసారి 


సమూహాలకి సాధ్యమైనంత దూరంగా
ఒంటరితనం నడిమధ్యలోకి నడవాలి
నిన్ను నువ్వుగా కలవాలి, పలకరించాలి, పరామర్శించాలి.,

ఏమో అలా చేస్తె
సమూహాలలొ లేని స్నేహం, సాంత్వన , కోలాహలం
నీకు నీలోనే దొరుకుతుందేమొ........
 ఒక్కోసారి 
శబ్ధాలను బహిష్కరించి నిశ్శభ్దాన్ని ఆహ్వానించాలి
కాలం అడుగుల చప్పుడు వినపడని ఖామోషి తేవాలి
ఏమో అలా చేస్తే 
నిశ్శబ్ధం మౌనం వీడి నీతో మట్లాడవచ్చు,
నువ్వు ఇదివరకెరుగని నిజాలను చెప్పవచ్చు
నువ్వు నిజమనుకున్న అబద్దాలను చెరపావచ్చు
ఒక్కోసారి 
ఆలోచనలన్నింటిని ఆర్పేసి,

 శూన్యాన్ని వెలిగించి ధ్యానించాలి
స్తబ్ధతలోని చైతన్యాన్ని,

 చైతన్యంలోని నిశ్చలతను అన్వేషించాలి
ఏమో అలా చేస్తె 

ఆ ధ్యానంలోనే సర్వసత్యాలు సాక్షాత్కరించవచ్చు,
సమస్త సంశయాలు ధ్వంసం కావచ్చు
ఒక్కోసారి 
స్నేహితులని కాకుండా ,

శత్రువనుకున్న వాడినీ సంప్రదించాలి
అహాలు అపోహలు అడ్డురాకుండా అడగవలసినవి అడగాలి

ఏమో అలా చేస్తే
స్నేహితుడిలా సలహాలతో సరిపెట్టకుండా

సహాయం కూడా చేస్తాడేమో
ఒక్కోసారి 
మనిషితో కాకుండా మనసుతో పరిచయించాలి

తనువుతో కాకుండా ఆత్మతో సహచరించాలి
ఏమో అలా చేస్తే,
పరిణయంగానె మిగిలిన ప్రహసనం
రసవత్తర ప్రణయంగా తర్జుమా కానూవచ్చు.....
ఒక్కోసారి 
కూడ బెడుతున్న సంపాదన కాకుండా
దాచి పెడుతున్న కాలాన్ని కూడా

ఆత్మీయులకు ఖర్చు పెట్టాలి
ఏమో అలా చేస్తే

కొని తెచ్చిన వస్తువులు ముడివెయ్యలేని అనుబంధాన్ని
కలిసి గడిపిన క్షణాలు, కడవరకు తోడు తేనూవచ్చు......
 ఒక్కోసారి 
పొందవలసిన సుఖాల జాబితా పక్కన పెట్టి
పోగొట్టుకున్న సంతోషాల చిట్టా విప్పి చూసుకోవాలి
ఏమో అలా చేస్తే
లేని వాటిలో వున్న సౌఖ్యం కన్న
వున్నవాటిలో లేని ఆనందంమేముందని తెలియావచ్చు...
 ఒక్కోసారి 
పరిగెత్తటం మానేసి
ఆయాస పడుతున్న కాలాన్ని.

 కుదురుగ కూర్చొని చూడాలి
రాలి పడిన క్షణాలని, నిమిషాలని, రోజులని,

 దులుపుకొని జేబులో దాచుకొవాలి
ఏమో అలా చేస్తే 

గమ్యంలో వుందనుకున్న గెలుపు గమనంలో దొరకావచ్చు
ఒక్కోసారి 
ప్రశ్నలడగడం, జవాబులు వెతకటం మానెయ్యాలి
పరీక్ష అనుకొని జీవితాన్ని చదవడం ఆపెయ్యాలి
ఏమో అలా చేస్తే 
ఫలితం గురించిన బెంగ లేకుండ
స్వేచ్చగా జీవించవచ్చు,
సంతృప్తిగా మరణిచనూవచ్చు........




కిరణ్ గాలి, అందించిన ఈ కవిత్వం నాకు చాలా నచ్చింది.
 కవి సంగమం నుంచి  మీ అందరికోసం అడిగితెచ్చిన ఈ కవిత్వం మీకు నచ్చుతుందని ఆశిస్తూ.......

6 comments:

  1. Replies
    1. హర్ష గారు, నా బ్లాగుకి స్వాగతం,,కిరణ్ గాలి గొప్పగా రాశారు, అభినందనకు ధన్యవాదాలండి.

      Delete
  2. chala bagundi ఎన్ని సత్యాలో !!! ఏమో ఇవి చదివితే అందరూ ఇలా రాయడానికి ప్రయత్నిస్తామేమో

    ReplyDelete
    Replies
    1. లక్ష్మి రాఘవ గారు,ధన్యవాదాలండి, ఇలా ప్రయత్నిస్తే మంచి కవిత్వం దొరుకుతుందండి.

      Delete
  3. ఒక్కోసారి అన్ని సత్యాలే కనిపిస్తాయ్..
    అన్నీసత్యాలే అనిపిస్తాయ్.
    అందించినందుకు మీకు మప్పిదాలు

    Note: స్వాంతన అని మనం అనుకునేది తప్పుట. సాంత్వన అనేది అందరూ అమోదిస్తున్నారు

    ReplyDelete
    Replies
    1. స్కై గారికి, నా బ్లాగుకి స్వాగతం అండి, కవిత నచ్చినందుకు ధన్యవాదాలండి, మీ సూచన కిరణ్ కి తెలియచేస్తానండి.

      Delete