Pages

1 October 2012

అంతర్జాతీయ శాఖాహార దినోత్సవ శుభాకాంక్షలు


నేడు ప్రపంచ శాఖాహార దినోత్సవం.

నీలోని మాంసమే,
నీకు ఎక్కువాయే.
చికెన్, మటన్ నీకు,
చావు తెచ్చు.

కంటికి నచ్చిందంతా కడుపులోకి దోపుకుంటే వచ్చేది అజీర్తీ, అనారోగ్యం. శారీరక శ్రమ తగ్గిపోవడంతో, తీసుకొనే ఆహారం కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి లైఫ్‌ స్టైల్‌ డిసీజెస్‌ దరి చేరకూడదనుకుంటే శాఖాహారం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. వెజిటేరియన్‌ స్పెషల్‌ మీ కోసం రోజువారీ దినచర్యలో మనకు కావాల్సిన పోషకాలు ఒట్టి శాఖాహారంలో దొరకవనుకుంటారు. బలం కావాలంటే చికెన్‌ తందూరీ, మటన్‌ మంచూరియా లాగించాలని అనుకుంటారు. నాన్‌ వెజ్‌లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయని, బలంగా ఉండడానికి కావాల్సిన ప్రొటీన్స్‌ లభ్యమవుతాయని అనుకుంటారు. అయితే మాంసాహారంలో పీచు పదార్ధాలు లేకపోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదని న్యూట్రీషియన్స్‌ చెబుతున్నారు. మాంసంలో లభించే ప్రొటీన్స్‌ కన్నా శాఖా హారంలోనే ఎక్కువ లభ్యమవుతాయి. వెజ్‌ వర్సెస్‌ నాన్‌ వెజ్‌ ఈ రెండు ఆహారాల మధ్య తేడా అనేక రకాలుగా ఉంటుంది. కంది పప్పుకి, కోడికూరకు పోటీ పెడితే ఏది గెలుస్తోందో చూద్దాం. వంద గ్రాములు కందిపప్పులో 26 గ్రామలు ప్రోటీన్లు ఉంటే, చికెన్‌లోని వివిధ భాగాలలో లభించే సగటు ప్రోటీన్లు కేవలం 18.4 గ్రాములే. 350 కేలరీలతో కందులే ముందున్నాయి. కోడిలో 159 కేలరీలే లభిస్తాయి. పప్పు ధాన్యాల్లో కార్బో హైడ్రేట్స్‌ 60 గ్రాములుంటే, చికెన్‌లో గుండు సున్నానే. పైగా కంది పప్పుకు కొవ్వు తక్కువే. కోడికి మాత్రం రెండు గ్రాములుంటుంది. ఐరన్‌ మాత్రం రెండింటిల్లోనూ ఇంచుమించు సమానంగానే లభిస్తుంది. మాంసాహారం జీర్ణం కావడానికి ఎనిమిది గంటలు పడితే, శాఖాహారం నాలుగు గంటల్లోనే అరిగిపోతుంది. జీర్ణ వ్యవస్థపై కూడా భారం తక్కువ పడుతుంది. 

8 comments:

  1. టీచర్ గారు డాక్టర్ ని మించిపోయారు, బాగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. మా బడి పిల్లలకోసం సేకరించినదండి,ఈ ఇన్ఫర్మేషన్ , ధన్యవాదాలు ఫాతిమా గారు...

      Delete
  2. మంచి information ఇచ్చారు భాస్కర్ గారు

    ReplyDelete
    Replies
    1. కావ్యాంజలి గారు, నా బ్లాగుకి స్వాగతం అండి, అక్కడక్కడ సేకరించినదేనండి, మా స్కూల్ అసెంబ్లీ కోసం,...ధన్యవాదాలండి, మీకు.

      Delete
  3. anavsaram gaa chetlanu champadam knate jantuvalani champadame better emo nadee . global warming kooda taggutunding hahaha sarcasm just 4 fuhn

    ReplyDelete
    Replies
    1. తనోజ్ గారు, చాలా రోజులకు పలకరించారు,మీరు చెప్పింది కూడా కొంత వరకు ఆలోచించాల్సిందేనండి, మీ బ్లాగ్ ను ఎప్పడూ లాంచ్ చేస్తున్నారండి,... ఎదురుచూస్తున్నాను.....

      Delete
  4. ప్రియగారు, నా బ్లాగుకి స్వాగతం, ధన్యవాదాలండి.

    ReplyDelete