చివరి చినుకులు
రాల్చుకుంటూ,
మధ్యంతరంగా వర్షం
వెళ్లిపోవచ్చు.
దాహాలను పూర్తిగా
తీర్చుకోనీకుండా.
ఒక నిండైన నదీ
ప్రవాహం, ఒకానొక సమయాన
కాస్తంత నిప్పుల
సెగకే, పూర్తిగా ఇంకి పోనూ వచ్చు,
మళ్లీమళ్లీ తడులు
దరిచేరకుండా.
ఎరుకతో కూడిన
ఆనందాల అన్వేషణలో
ఉన్నట్టుండి,
విరగకాసే వృక్షమొకటి
అర్థాంతరంగా నేల
వడిలోకి కూరుకుపోనూ వచ్చు.
వెలుగులు చీకట్లలో
దాక్కోనూ వచ్చు,
జీవితం ఏకాంతాన్ని
హత్తుకోనూ వచ్చు.
ప్రేమలు
ప్రకటించబడని చోట్ల,
విత్తనం
మొలకలెత్తనని భీష్మించనూ వచ్చు.
ఆకాశం ఉరమవచ్చు,
మెరుపుల అందాలు అద్దకోనూ వచ్చు.
ఉషః, సంధ్యా
కాంతులతో మెరిసిపోనూ వచ్చు.
అనుదినము కొత్త
కవిత్వమై కనువిందు చేయనూ వచ్చు.
ఇదెలా, ఇదెలాగో ఇలా,..
మాయమవడం,
మూసుకుపోవడం,
వీడ్కోలు చెప్పడం,.
సాధ్యమా, మరి నీకు ఆకాశమా?
Wowww..ending superbgaa undi,baskar gaaroo..
ReplyDeleteఅసాధ్యమే మరి
ReplyDeleteఇదెలా, ఇదెలాగో ఇలా,..
ReplyDeleteమాయమవడం, మూసుకుపోవడం,
వీడ్కోలు చెప్పడం,. సాధ్యమా, మరి నీకు ఆకాశమా?
అన్ని భావనలు అద్భుతంగా ఉన్నాయి ఎప్పటిలానే భాస్కర్ గారు