ఏదైతే వద్దనబడిందో,
అదే అద్భుతమవుతుందిపుడు,
ఏదైతే ఆచరించబడకూడదో,
అదే దివ్యమార్గమై,
ఆరాధించబడుతుందిప్పుడు.
పేరుకుపోతున్న
వికృతత్వాలకు
ఒక ముసుగుకావల్సినప్పుడు,
కొత్తరూపాల్లో,
సృజనాత్మక అచ్చుల్లో, మూసల్లో,
అన్ని అవలక్షణాలిప్పడు,
తెంపరితనంతో, కొత్త కత్తులై మెరుస్తు,కరుస్తూ,
రక్తాన్ని రుచిచూస్తున్నట్లున్నాయ్.
బ్రష్టుపట్టిన భావాలిప్పుడు,
బంగారు బొమికలై,
మరమనుషుల నోళ్ళల్లో,
తళతళా మెరుస్తున్నాయ్.
సరసంగా ఆశపెట్టి,
వరసగా ఒక్కోక్కరికి,
నేరుగా విషాన్ని నరాల్లోకి, నెట్టేస్తున్నట్లున్నాయ్.
చూడకూడని దాన్ని,
బయటవేలాడేసుకునే,దిష్టిబొమ్మలే,
దేవతామూర్తులై స్తుతించబడుతున్నాయిప్పుడు.
తప్పొప్పులు తుంగలోతొక్కి,
ఏదైతే పొగడబడుతుందో,
అదే పదిమందికీ దారవుతుంది,
వికృతత్వమే పరమపవిత్రమౌతుంది.
తప్పనిసరై తప్పు చేసేవాడు,
తడబడి దొరకిపోతుంటాడు,
తప్పే బతుకై బతికేవాడు,
దొరై దబాయించేస్తుంటాడు.
ఏ ఇజానికి లొంగని వాడు,
వంటరౌతాడిక్కడ.
ఏ గుడారంలోకో దూరితే,
అదృష్టం వరిస్తే,
అధిపతై ఏలచ్చిక్కడ.
"బ్రష్టుపట్టిన భావాలిప్పుడు,
ReplyDeleteబంగారు బొమికలై,
మరమనుషుల నోళ్ళల్లో,
తళతళా మెరుస్తున్నాయ్."
అక్షరాలా నిజమే!
చాలా అర్ధం ఉంది మీ కవితలో!
చాలా బాగా రాసారు భాస్కర్ గారు. కొంచెం ఆవేశం/అవేదన కూడా కనిపిస్తున్నాయి.
హ,హ,..వెన్నల గారు, ఏదో సరదాగా రాయడమేనండి, నచ్చినందుకు ధన్యవాదాలండి,.
Deleteచాలా బాగా రాసారు
ReplyDeleteసృజన గారు, మీ అభినందనకు ధన్యవాదలండి.
Deleteఏ ఇజానికి లొంగని వాడు,
ReplyDeleteవంటరౌతాడిక్కడ.
ఏ గుడారంలోకో దూరితే,
అదృష్టం వరిస్తే,
అధిపతై ఏలచ్చిక్కడ.
it requires a very broad mind to write such a lines . some times u sound amazing buddy .good man
ధన్యవాదాలు తనోజ్ గారు, చాలా కాలానికి మీ కామెంట్, నాకు ఆ లైన్స్ నచ్చాయండి, మీ కవిత్వం, బ్లాగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు....
ReplyDeletenay i aint gonna start anything.but u r doing good mate keep it up
ReplyDelete