ఒక ఇష్టమైన భావానికి ,
స్పష్టమైన ఆకృతినిద్దామని,
ఎంత తపనపడ్డా,
ఒక్క అక్షరమైన రూపుదిద్దుకోదేం !
మనసులోని ఆలోచనల
వెల్లువ మొత్తాన్ని,
కొత్తగా ప్రతిబింబిద్దామంటే,
అందంగా ప్రకటిద్దామంటే,
ఏ ఒక్కటి సహకరించదేం !!
స్పందనల సాగరాన్ని,
యథాతధంగా చిత్రిద్దామంటే,
ఎదురు చూడని దోరణిలో,
హరివిల్లులా చూపిద్దామంటే,
ఎంత వెదికినా, ఏ రంగులూ దొరకవేం...
endukano mari...bhaskar gaaru...Baavundi mi aksharaala vedukulaata
ReplyDeleteమంజు గారు, ధన్యవాదాలండి.
Deleteసమ్మె...అందులోనూ అక్షరాలతోనా అని కంగారుపడ్డా, హమ్మయ్య:-)
ReplyDeleteపద్మార్పితకు కంగారా,..అమ్మో,..ధన్యవాదాలండి,.
Deleteఒకోసారి అంతేనండి....బాగుంది
ReplyDeleteతెలుగమ్మాయ్ గారు, నా బ్లాగ్ కు స్వాగతం,.అభినందనకు ధన్యవాదాలు.
ReplyDeleteఇన్ని అక్షరాలతో,ఇన్ని పదాలను, ఇంత అందంగా కూర్చి ఒక్క అక్షరమైన రూపుదిద్దుకోదేం?? అని మీరు అంటే...ఇంక నా లాంటివాళ్ళు ఏం అనుకోవాలండి???....బాగుంది భాస్కర్ గారు :)
ReplyDeleteఅంజలి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలండి.
Deleteఒక్కోసారి తప్పదండీ..ఆ సమ్మెతనమే కవితై పరిడవిల్లుతుంది...అభినందనలు భాస్కర్జీ...
ReplyDeleteవర్మ గారు, అవునండి,.ఒక్కోసారి ఒక్క అక్షరం కూడా గుర్తుకు రాదు,. ధన్యవాదాలండి.
Deleteఅక్షారలు అందం గా పొదిగి మరీ కవితలు రాసేస్తూ ఇలా అక్షరాల సమ్మె అనడం నాకైతే బాలేదు.. :))
ReplyDeleteబాగుంది మీ కవిత.
వెన్నల గారు, చాలా కాలానికి మీ కామెంట్,.ధన్యవాదాలండి.
ReplyDelete