Pages

29 October 2012

అక్షరాల సమ్మె



ఒక ఇష్టమైన భావానికి ,
స్పష్టమైన ఆకృతినిద్దామని,
ఎంత తపనపడ్డా,
ఒక్క అక్షరమైన రూపుదిద్దుకోదేం !
మనసులోని ఆలోచనల
వెల్లువ మొత్తాన్ని,
కొత్తగా ప్రతిబింబిద్దామంటే,
అందంగా ప్రకటిద్దామంటే,
ఏ ఒక్కటి సహకరించదేం !!
స్పందనల సాగరాన్ని,
యథాతధంగా చిత్రిద్దామంటే,
ఎదురు చూడని దోరణిలో,
హరివిల్లులా చూపిద్దామంటే,
ఎంత వెదికినా, ఏ రంగులూ దొరకవేం...

12 comments:

  1. endukano mari...bhaskar gaaru...Baavundi mi aksharaala vedukulaata

    ReplyDelete
    Replies
    1. మంజు గారు, ధన్యవాదాలండి.

      Delete
  2. సమ్మె...అందులోనూ అక్షరాలతోనా అని కంగారుపడ్డా, హమ్మయ్య:-)

    ReplyDelete
    Replies
    1. పద్మార్పితకు కంగారా,..అమ్మో,..ధన్యవాదాలండి,.

      Delete
  3. ఒకోసారి అంతేనండి....బాగుంది

    ReplyDelete
  4. తెలుగమ్మాయ్ గారు, నా బ్లాగ్ కు స్వాగతం,.అభినందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. ఇన్ని అక్షరాలతో,ఇన్ని పదాలను, ఇంత అందంగా కూర్చి ఒక్క అక్షరమైన రూపుదిద్దుకోదేం?? అని మీరు అంటే...ఇంక నా లాంటివాళ్ళు ఏం అనుకోవాలండి???....బాగుంది భాస్కర్ గారు :)

    ReplyDelete
    Replies
    1. అంజలి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలండి.

      Delete
  6. ఒక్కోసారి తప్పదండీ..ఆ సమ్మెతనమే కవితై పరిడవిల్లుతుంది...అభినందనలు భాస్కర్జీ...

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు, అవునండి,.ఒక్కోసారి ఒక్క అక్షరం కూడా గుర్తుకు రాదు,. ధన్యవాదాలండి.

      Delete
  7. అక్షారలు అందం గా పొదిగి మరీ కవితలు రాసేస్తూ ఇలా అక్షరాల సమ్మె అనడం నాకైతే బాలేదు.. :))
    బాగుంది మీ కవిత.

    ReplyDelete
  8. వెన్నల గారు, చాలా కాలానికి మీ కామెంట్,.ధన్యవాదాలండి.

    ReplyDelete