1
కవితా సువార్త,
మూడవ అధ్యాయం,.
పంతొమ్మిదవ వచనం,..
నా వాక్యం పరాధీన, ఈ లోకం బంధిఖాన.
2
సందేహపు మొఖాలేసుకొని,
మూకుమ్మడి దాడి చేసాయ్,.
మా పుట్టుకకు కారణమెవరని,.
బిత్తర చూపుల్ని,తమాయించుకుంటూ,
తెల్లపేపరైన మొఖాన్ని,
మరంత పాలిపోకుండా,
భావాలను ఎంత బంధించినా,.
అయ్యజాడల అస్పష్టతను,
ఎరుకపరచలేనే అసమర్ధత,
అలుముకుంటూనే వుంది, నన్ను,.
3
ఏఏ రసాయనాలు కలసి వాక్యాలను నిర్మిస్తాయో,.
ఏ అచేతన చర్యాఫలమై, వాక్యం నను హత్తుకుందో,.
ఏఏ అనుభూతులు వాక్యమై ఫ్రతిఫలిస్తాయో,.
ఏ అదృశ్యాలను వీక్షించి
అంతర్నేత్రాలు,సిద్దపరుస్తాయో,..నా వాక్యాలను,..
4
చెవుల్లో దూరి దూరి,
కనుగోళపు గదులు దాటి,
తలకెక్కిన రుచులేవో,
ఎగభీల్చన వాసనేదో,
స్పర్శ చేత అతుకబడి,
ఏది నన్ను సృజిస్తుందో,
ఏ జ్ఞానం వెల్లువెత్తి,వాక్యం ఉప్పొంగుతుందో,.
ఏ బీజం పితరుడై, నా వాక్యం జనిస్తుందో,..
5
నా లోపలి, లోలోపలి వేలకోట్ల కణాలెన్నో,.
మోసుకుంటు తిరుగాడును,
ఏ ఆదిమ ముద్రలనో, ముద్రించిన ప్రతులనో,..
మూలాలకై వెతుకులాట, అలివికాని అన్వేషణ,.
మిడికజ్ఞానపు మిధ్య కదా,సొంత గొంతుకనేది,.
6
లోతుల్లోకి పయనిస్తున్నప్పుడు,
ప్రతిది సంతోషాన్నివ్వలేదు,
దుఃఖానికి హేతువై
మిగలాలేదు,.
సారాంశ సమీక్ష అను చివరి ప్రకటన,.
నా వాక్యం నాది కాదు,.
ఈ దేహం నాది కాదు,.
అసలు నేను నేను కాదు,.
మీ "వాక్య ప్రకటన" వెనుక ఇంత అంతర్మధనం ఉంటుందనమాట!బాగుంది భాస్కర్ గారు.
ReplyDeleteహ,హ,..నిజానికి అంతర్మధనం అంతగా వుండదండి,.ఫేస్ బుక్ లో ఒకరు,తిలక్ గారిది సొంత గొంతుక కాదు అని వ్యాఖ్యానించారు,.అప్పుడు రాసుకున్న వాక్యాలకు,.ఇంకొన్ని కలపి రాసిన కవిత ఇది,.నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెలగారు,..
Deleteళొలోపలి వ్యకీకరణ. చాలా బాగుంది
ReplyDeleteవనజ గారు,మీ అభినందన ఆనందదాయకం,.
Deleteకవి అంతరంగ వాక్య ప్రకటన బాగుంది భాస్కర్జీ...
ReplyDeleteఅభినందనలతో..
వర్మగారు, మీ ఆత్మీయ అభింనందన,.మరన్నీ వాక్యాలకు ప్రాణం పోస్తుంది,.ధన్యవాదాలండి,.
Delete