Pages

21 May 2013

తొక్కలు - 4తలతిక్క ట్యుషన్ సెంటర్లో
ఒకానొకరోజు,
హఠాత్తుగా మెలుకువవోచ్చిన ఓ సారు,..
పదోతరగతి పిల్లోడ్ని పైకి లేపి,
పదేళ్లలో నేను నీకెక్కించన చెత్తసారాన్ని,
మూడు ముక్కల్లో చెప్పవోయ్,.అన్నాడు,.
తలగీరుకుంటు ఇలా చెప్పాడు వాడు,.

మూర్ఖులు వాదిస్తారు,.
జ్ఞానులు తలాడిస్తారు,.
అటుఇటు కాని వారు అనుభవిస్తారు,.

మధ్యలోది మేలైందనుకుని,.తలడిస్తూ,.
పక్కనే ముక్కుల్లో పొక్కులు లాక్కుంటున్న,
మూడోతరగతి పిల్లని లేపి,
ఆ ముక్కల్లో, నీకెం అర్థమైందో నీ మాటల్లో చెప్పమ్మి,
అన్నాడు మాస్టారు,.

న్యూస్ చానళ్లు తప్ప
మరేం మార్చనీయని  నాన్న,
పెంపకంలో పెరిగిన పాప ఇలా చెప్పింది,.

కమ్యూనిస్ట్ వాదిస్తాడు,
మన్మోహన్ తలాడిస్తాడు,.
సోనియా,రాహుల్లు అనుభవిస్తారు,.

3 comments:

 1. meekenduku communistula meeda baaga dwesham unnattu undi mee chaala kavithallo adhi kanapaduthondhi

  ReplyDelete
  Replies
  1. అయ్యో అదేం లేదు తనోజ్ గారు,.మా ఇంట్లో ఎక్కువమంది కమ్యూనిస్ట్ అభిమానులే,..కాని వాళ్ల ఎత్తుగడలే ఎందుకో విచిత్రంగా వుంటాయ్,..

   Delete
 2. edhi emaina ni post mathram bale undhi......enjoyed reading your posts

  ReplyDelete