1
ఎదురుగా కూర్చోని, ఓ చల్లని సాయత్రం
పలుచని గాలి తెరలతో ఆటలాడుతూ కదుల్తున్న,
కురులను వెనక్కినెట్టుకుంటూ,
దొరికిన అవకాశాన్ని, ఏ మాత్రం జారవిడుచుకోకుండా,
కనులలోకి సూటిగా చూస్తూ,ఇలా అంటుంది తను,.
సంధిగ్ధపు చిరునవ్వుని, దిగ్ధంలా సంధింస్తూ,....
విసుగులేని, విరామమెరుగని
నిరంతర అసంతృప్తులతో నలిగిపోతూ,
అపోహల అపార్థాల అగడ్తలు దాటలేక,
మిథ్యాప్రపంచపు ఉచ్చుల్లో చిక్కి,
స్థిమితంగా వుండలేక,
ద్రిమ్మరివై సంచరిస్తావు, ఎందుకలా,..
కాస్తంతా సేదతీరరాదు, ఇలా నా ఒడిలో
కొద్ది క్షణాలు విశ్రమించి,...
2
సుఖాలు కాని సుఖాల మధ్య,
దుఃఖాలు రానివ్వని దుఃఖాల మధ్య,
ఇక్కిలించే కోతుల మధ్య,
క్లారిటి లేని కుక్కుల మధ్య,
నక్కల జిత్తుల టక్కరుల మధ్య,
పసిపిల్లలాంటి కవుల మధ్య,
అదృశ్యాలై వశపరుచుకునే,
భూతప్రేత పిశాచ వాకిళ్ల మధ్య,
వ్యామోహపు చివరి సరిహద్దుల బలహీనతల మధ్య,
ఏం బావుకుందామని భ్రమిస్తుంటావిలా,
వాస్తవజీవితాన్ని వాయువులకొదిలి,.అంటూ
లేని సందేహాల్ని చొప్పిస్తూ,
ఫేసును ప్రశ్నార్థకం చేస్తూ,
మరికాస్తా దగ్గిరికు జరిగిందామె,,.
3
ఇలారా ఇక ఈ రాత్రికి,అన్నింటిని వదిలి
మెత్తని కండల గుండెల పొంగుల మధ్య,
తలవాల్చి, కాస్తా ఊరడిల్లుదువుగాని,.
కాలసంకోచాల్ని విస్మయంగా చూద్దువుగాని,.
హృదయబిలయపు లయల సవ్వడుల
నేపధ్యాన ప్రశాంతంగా నిద్రిద్దువుగాని,..
బుజ్జగిస్తూ, అనునూయంగా ఇంకా ఇలా అంది,
చలనములేని అక్షరాల మధ్య,
తృప్తినివ్వని వాక్యాల మధ్య,
మనసులేని ముఖపుస్తకాల మధ్య,ఈ పత్రికలమధ్య
పిచ్చివాడవై మిట్టాడబోకు,
అందుబాటు అమృతాన్నొదిలి,
అంతులేని భ్రమలజీవివై,.
రా ఇలా రా, ఇక ఈ రాత్రికి అంటూ,
ప్రేమగా హృదయానికి హత్తుకుంటూ,.
4
ఇక ,మరుసటి వేకువ మసక వెలుతుర్లలో
ఇలా గొణుగుతుంది,తను,.
బైరాగులు రాసుకుంటే బూడిద రాలినట్లు,.
కవులు కవుల కలబడితే,
మహా అయితే ఏం జరుగుతుంది,..
నాలుగు కవితలు విదుల్చుకొని నిద్రపోక,..
అన్నం మాని దిగులుపడ్డాడు, పిచ్చినాబట్టంటూ,
తన చల్లటి మెడవంపులో,మరంతగా పొదువుకుంటూ నన్ను,.
కలవరింతో, మెలుకువతో అందో
అర్ధంకాలేదు కాని,.ఆ ఆస్వాదనలో,.....
Wonderful
ReplyDeleteరమా గారు ధన్యవాదాలండి,.చదివి మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు,.
Delete:) :)
ReplyDeleteధన్యవాదాలు వనజగారు,.
Deleteekkado eado vundi kaani ardham kaavadam ledu nice feel andi
ReplyDeleteఫేస్ బుక్ గ్రూప్ లో జరిగిన వాదానలతో సరదాగా రాసిందిది,.ధన్యవాదాలలు మంజు గారు,..
Deletebaaga rasarandi 4th stanza aithey naaku inka baga nachindhi
ReplyDeletesuperb man maalli chadivithey 3rd stanza kooda chaala bavundanipinchindi
ReplyDeleteధన్యవాదాలు తనోజ్,..మీరు మళ్లీ చదివి వాఖ్యానించండం.,.ఆనందంగా వుంది,.మీరిచ్చే స్ఫూర్తి మరువలేనిది,.
Delete