Pages

17 September 2012

వాడొక్కడేనా ఇంకెవరన్నా వున్నారా ?


చూపులతో మంత్రించేవాడు,
స్వప్నాలను నియంత్రించేవాడు,
వాడొక్కడేనా ఇంకెవరన్నా వున్నారా ?
అంకుశంతో మెదడుని లోభరిచేవాడు,
గుండె లోతుల్లుకి గాలం వేసి,
మనుసుని చేజిక్కించుకొనేవాడు,
వాడొక్కడేనా ఇంకెవరన్నా వున్నారా ?
దేహాన్ని అల్లాడించేవాడు,
ఈ దాహాన్ని తీర్చేవాడు,
వాడొక్కడేనా ఇంకెవరన్నా వున్నారా ?

8 comments:

  1. అందరూ ఒక్కడే అంటారుకదండి:)

    ReplyDelete
  2. అమ్మయ్య, మీరొక్కరన్నా కామెంటు పెట్టి, నన్ను బోలెడంత ఆనందపెట్టారండి,ధన్యవాదాలు ప్రేరణ గారు.

    ReplyDelete
  3. ఇంకెక్కడున్నాడు? మొన్న పోయాడుగా, సుమన్? :-?

    ReplyDelete
  4. హ,హ,ఇంతకి సుమన్ ఎవరండి..యస్.కె.యన్.ఆర్ గారు.

    ReplyDelete
    Replies
    1. సుమన్ అంటే తెలియదా?! మీరు ETv చూడరా?! అంతరంగాలు ...టరడొయ్... టరడొయ్..
      (ని)కృష్ణుడి వేషం వేస్తే ETv గోపికలంతా మైమరచి గర్భా కోలాటం ఆడేవారు. :))

      Delete
    2. ఓ... ఆ సుమనా, మీకు చాలా అభిమానమా యస్.కె.యన్.ఆర్ గారు, ఆయనంటే. ఇది చదవగానే ఆయనే గుర్తొచ్చాడంటే.....

      Delete
  5. :) ఇంతకి ఎవరో ఆ ఒక్క(రు)డు.... చెప్పనే లేదు... :(

    ReplyDelete
    Replies
    1. హ,హ....ఆ ఒక్కరేవరైనా, ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు వుంటారండి. ధన్యవాదాలు సంతు గారు.

      Delete