Pages

19 September 2012

ఐదు పైసల ఆత్మకథ (An auto biography of Five paisa)



భారతదేశానికి చెందిన ఐదు పైసలు అను నేను 1957 వ సంవత్సరంలో జన్మించాను. పుట్టిన కొత్తల్లో బొద్దుగా, ముద్దుగా వుండేదాన్ని నేను. అందరూ నన్ను అపూరూపంగా ఐదు నయాపైసలు అని పిలుస్తుండే వారు. నన్ను క్యూప్రో నికెల్ లోహం తో తయారు చేసేవారు, అవును, ఇంతకీ మీకు ఆ క్యూప్రోనికెల్ లో ఏఏ లోహాలు వుంటాయో తెలుసా(75 శాతం రాగి, 25శాతం నికెల్).... 4 గ్రాముల బరువుతో, చతురస్త్రాకారంలో వుండేదాన్ని. మూల నుంచ మూలకు నా పొడవు 22 మిల్లీమీటర్లు. అప్పట్లో తీసిన ఓ ఫోటోను చూపిస్తాను వుండండి. భలే వుంది కదూ..1957 నుండి 1963 వరకు నా బాల్యం ఆనందంగా గడిచిపోయింది.
1964 నాటికి కొత్తదనం పోయింది కదా, అందుకే నాలోని నయా ను తొలగించేసి, ముద్రించేవారు. నన్ను తయారుచేసే లోహంలో ,బరువు లో , రూపంలో ఎలాంటి  మార్పేమి చోటు చేసుకోలేదులేండి. 1964.65,66 సంవత్సరాలలో ఇలానే వెలువడ్డానండి. అప్పటి ఫోటోని కూడా చూద్దాం రండి.

1967 వచ్చేసరికి, నా కష్టాలు ప్రారంభమైనాయండి. నన్ను తయారుచేసే లోహాన్ని మార్చి, అల్యూమినియంలో ముద్రించడం మొదలు పెట్టారు. మెరపు వుంది కాని, కొద్ది కాలానికే అది పోయేది, బరువు కూడా 1.5 గ్రాములు చేసేసారు,.  సైజులో , రూపంలో పెద్దగా మార్పులేమి లేవులే,..1967 నుండి 1978 వరకు ఇదీ నా రూపు. కొంచెం బాధగా అనిపించినా  తప్పదు కదా, సర్దుకుపోయేదాన్ని,


1972 – 1984 మధ్యకాలంలో నాలోని ఐదును పెద్దగా వేయడం మొదలుపెట్టారు. మీలో ఎక్కువ మంది నన్ను ఇలానే చూసివుంటారేమో... నేను నడివయస్సు దాటుతున్నానేమో. అనే సందేహం నాలో కూడా మొదలై నన్ను బాధించడం ప్రారంభమైన దశ ఇది. పిల్లలకు ఓ చిన్న బొరుగుముద్దనో, ఓ చాక్లేట్ మాత్రమే ఇవ్వగలిగానిప్పుడు.
అప్పటి నా రూపం ఇలా వుండేదండి, 1.5 గ్రాముల అల్యూమినియం నాణెంగా....

అయితే ఈ కాలంలో నాజీవితంలో ఆనందాన్నిచ్చే సంఘటనలు కొన్ని జరిగాయండి. వాటిని మీతో పంచుకోకపోతే నాకు తృప్తిగా వుంటుందా,  చెప్పండి. అవేమిటో చెప్పగలరా మీరు, నేనే చెప్పేస్తానులెండి.
ఐక్యరాజ్యసమితి కి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారి నినాదాలైన "అందరికి ఆహారము,పని" నినాదం తో 1976లోను, "అభివృద్ది కోసం పొదపు" నినాదం తో1977 లోను, "అందరికి ఆహారము, నివాసం" నినాదంతో 1978లోను, అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా 1979 లోను ప్రత్యేకంగా నా నాణెలను విడుదల చేసారు. నా జీవితం లో నేను అందుకున్న గొప్ప గౌరవాలవి. ఏ నాణెనికైనా అంతకన్నా కావలసినది ఏముంటుంది, చెప్పండి.వీటినే కమోరేటివ్ నాణెలు అంటారండి. వాటిని చూపిస్తాను, రండి.
1977

1978



1979

1976

 వృద్దాప్యం సమీపించింది,నాకు., నా బరువు కూడా కేవలం ఒక గ్రాముకి తగ్గిపోయింది. నా చివరి దశే ఇది, 1984 నుంచి 1994 వరకు కొనసాగిన ఈ దశలో, నా పరిస్థితి అత్యంత దయనీయమని చెప్పుకోవచ్చు. పిల్లలు నన్ను హేళనగా చూడటం మొదలైంది. ఆఖరికి బిచ్చగాళ్లు కూడా నన్ను చూసి ముఖం తిప్పుకుంటున్నారిప్పుడు. నాకు బాధగానే వుండేది, వారికేమి చేయలేక పోతున్నానని. ఈ ప్రపంచానికి , నా ఆఖరిచూపులు 1994లోనే, నా జీవితం ముగిసిపోయింది,42 ఏళ్ల వయసులో... నాకు తెలుసు ఇక ఏనాటికి, నేను మీ దగ్గరకు రాలేనని,....

ఎక్కడైనా మీకు నా శకలాలు తారసపడితే, ఒక్కసారైనా ఆప్యాయంగా తడమండి, మీ పిల్లలకో, మనవళ్లకో నన్ను చూపించి, మీ జ్ఞాపకాలను వారికి పంచండి. ఇదే నేను మీకు చెప్పగలిగే ఆఖరుమాట, గుర్తుంచుకుంటారు కదా, మితృలారా.......సెలవిక..............


22 comments:

  1. Nice Info and Nice Tag line, Shared on my Facebook

    ReplyDelete
    Replies
    1. రంగాచార్యులు గారు, నా బ్లాగుకి స్వాగతం,మీ అభినందనలకు, ఈ టపాను ఫేస్ బుక్ లో షేర్ చేసినందుకు ధన్యవాదాలు.

      Delete
  2. Replies
    1. శివరామ ప్రసాద్ గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  3. భాస్కర్ గారూ చాలా చాలా మంచి సేకరణ అండీ.. పరిచయానికి ధన్యవాదాలు. నాణేలు మీ దగ్గర ఉన్నాయాండీ లేక చిత్రాలు మాత్రమే సేకరించారా?(తెలియక అడుగుతున్నా అండీ).
    వినాయక చవితి శుభాకాంక్షలు మీకు,

    ReplyDelete
    Replies
    1. సుభ గారు ధన్యవాదాలండి, నా కలెక్షన్లో ఇవి అన్నీ వున్నాయి. కానీ పై ఫోటోలు నావి కావండి. సంవత్సరాల వారీగా చూస్తే, ఓ ఆరు సంవత్సరాలవి లేవండి.ఇప్పడు కలెక్ట చేయడం తగ్గపోయింది,ఓ నాలుగేల్ల క్రితం నాణేలే లోకంగా వుండేది .ఇప్పడిలా బ్లాగుల పిచ్చి మొదలైందండి.హ,హ.....

      Delete
  4. మంచి సమాచారం. మీరు రాసిన విధానం బాగుంది.

    ReplyDelete
    Replies
    1. శిశిర గారు, బ్లాగుకి స్వాగతం, మెచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  5. Replies
    1. హ,హ,...ధన్యవాదాలు యస్.కె.ఎన్. ఆర్ గారు.

      Delete
  6. ఐదు పైసల జీవిత కథ చాలా బాగా చెప్పారండీ..
    మీకు,మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు..

    ReplyDelete
    Replies
    1. రాజి గారు,మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  7. భాస్కర్ గారు చక్కని సమాచారం అందించారు. రాసిన విధానం చాలా బావుంది. వినాయక చవితి శుభాకాంక్షలండీ.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు, మీ ఆభినందనలకు.

      Delete
  8. వావ్! భలే ఉంది! నా దగ్గర రెండు, మూడు రకాలు మాత్రమే ఉన్నాయి.
    ఇలా నా దగ్గర రెండు పైసల కలెక్షన్ ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రసజ్ఞా మేడమ్, మిమ్మల్ని కాకా పట్టాలండి, మీ దగ్గరుండే కాయిన్స్ కోసం,..

      Delete
  9. వావ్ చాలా బావుంది 5 పైసల ఆత్మ కథ......

    ReplyDelete
    Replies
    1. సంతు గారు నా బ్లాగ్ కు స్వాగతం. ఐదు పైసల ఆత్మకథ నచ్చినందుకు ధన్యవాదాలండి.

      Delete
  10. నాలుగు పదులు నిండీ నిండకుండానె ఈ ప్రపంచాన్ని వదిలివెళ్ళిన 5 పైసలకు 5 నిముషాలు మౌనం పాటిస్ఠూ నా 5 పైసలను గుర్తు చెసినందుకు ధన్యవాదాలు..

    ReplyDelete
  11. నాలుగు పదులు నిండీ నిండకుండానె ఈ ప్రపంచాన్ని వదిలివెళ్ళిన 5 పైసలకు 5 నిముషాలు మౌనం పాటిస్ఠూ నా 5 పైసలను గుర్తు చెసినందుకు ధన్యవాదాలు..

    ReplyDelete
  12. నాలుగు పదులు నిండీ నిండకుండానె ఈ ప్రపంచాన్ని వదిలివెళ్ళిన 5 పైసలకు 5 నిముషాలు మౌనం పాటిస్ఠూ నా 5 పైసలను గుర్తు చెసినందుకు ధన్యవాదాలు..

    ReplyDelete
    Replies
    1. mallikarjunarao ch,.. ధన్యవాదాలండి,..

      Delete