Pages

30 July 2013

గుగాగీలు - 3



@ఇక కవిత్వాన్ని వదిలేద్దామనుకుంటున్నాను గురువు గారు ,

#నాలుగు మాటలు చెప్తాను,
.వింటావా నాయానా,.

@చెప్పండి స్వామి,.మీరంతకంటే చేయగలిగేదేముంది కాని,..

# వేసుకున్నంత సులభంగా, తీసిపారెయ్యడానికి
అదేమన్నా భుజాన కండవా అనుకున్నావా,.
కవిత్వం కన్నా కవిత్వం అది,.

@ ఇక,రెండో మాట చెప్పండి, స్వామి

# కూరుకుపోవడం తెలుసా ఊబిలో,.
బయట పడాలని ప్రయత్నేంచే కొద్ది,
మరంత లోతుగా, మరంత బలంగా,
ఇరుక్కుపోతావ్,లొపల్లోపలే,.
ఇక మిగిలింది,.మునిగిపోవడమే,...

@అంతేనంటారా స్వామి,..అయితే,..మూడో మాట చెప్పెయండిక,..

# పద్మప్యూహం గుర్తుందిగా,..
ప్రవేశమే కాని,.మరలరావడం వుండదు,.
కవిత్వమూ అంతే,.
అంటించుకోవటం తప్ప,
వదిలించుకోవడం వుండదు,..
కడతేరిపోవడమే కాని,
కళ్లు తెరుచుకోవడం వుండదు,.

@దిస్ ఈజ్ టూ మచ్ గుగా,..
కళ్లు తిరుగుతున్నాయ్ నాకు,.
చివరిది చెప్పండిక,..వెళ్తాను,..

# కాష్మోరాని ప్రయోగించాడా,..చెప్పు,.
క్షణంలో వదలకొడతాను,.
కవిత్వం ఆవహించాక,.
ఏ కాద్రాలు  కాపాడలేడు,..
వాడి ఖర్మకి వాడ్ని వదిలేయడం తప్ప.,.

చివరి సీన్ - పడిపోయిన శిష్యుడి మొఖం మీద నీరు చిలుకరిస్తున్న గుగా,..

note,. కాద్ర ,. తులసీ నవలలో మంత్రగాని పేరు,..


28 July 2013

విలోమగీతం


గాలికెదురుగా ఎగిరే పక్షులు,.
పక్షులా ఆ రెండు రెక్కలు,.
గాలి గుండెను చీల్చినప్పుడు,.
గాయపడినా గాలివేదన,.
విన్నవా,.నువ్వెప్పుడైనా,....

వట్టిపోయిన ఏటిలోన,.
నీటిధారల జాడకోసం,..
ఎదురుచూసి, ఎదురుచూసి,.
ఎండిపోయిన శిలల దుఃఖం,..
అనుభవించవెప్పుడైనా,....

నింగనొదిలి, నేలరాలి,...
ఛిధ్రమైన మేఘమాలిక,
చావు కష్టం,.కళ్లారాచూసి,..
అంతులేని ఆకాశ రోదన,.
ఛాయనైన, కలగన్నవా నువ్వు,..


25 July 2013

గుగాగీలు -2


@గురువుగారు,..ఓ సందేహం
అడుగునాయనా,..
@బలమైన కవిత్వం ఎలా రాయాలి స్వామి,..
ముందు కొన్ని కొత్త బూతులు నేర్చుకో నాయనా,..
తరువాత చెబుతాను, కవిత్వం సంగతి,...
------------------------------
కళ్లలో వెలుగు నింపుకొని,.
ఇలా అన్నాను,.ఎదురుగా కూర్చున్న అమాయకులతో

ఆలోచనలను చిదిమి, పెట్టే దీపాన్నే,
కవిత్వమంటారు నాయనలారా,..

వెనకనుంచి వెటకారపు వాక్కు ఇలా వినిపించింది,.
బుర్రలను చిధ్రం చేసేదాన్ని కాదా,.అంటూ,.

హతవిధీ,...

పిల్లలు ప్రయోగాలు,.చేద్దాం రండి,..

ఉంగరపు వేలును వేరు చేయగలరా

ప్రతిచోట సరదాగా చేయించి,ఆసక్తి రేకెత్తించగల ఓ చిన్న ప్రయోగం ఇది.
చేతిలోని నరాల నిర్మాణం, కండరాల అమరిక వేలి చలనాలను ఎలా నియత్రిస్తాయో, అర్ధం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది,.


పటం-1


పటంలో చూపిన విధంగా చేతులు అమర్చి,
 మధ్యవేలును లోపలికి ముడవండి,.

మిగతా వేళ్లను కదపకుండా ఇప్పుడు ఉంగరపు వేలును
 వేరు చేయడానికి ప్రయత్నించండి,,

ఫలితం - ఇది కష్టసాధ్యమైన పని..98 శాతం మందికి ఇది వీలు కాదు.
మిగతా వేళ్లలాగ అది స్వతంత్ర చలనాలను కలిగివుండదు,.



కారణం -ఉంగరపు వేలు నందలి నరం మధ్యవేలు నరంతో ఎక్కువగా అనుసంధానమై వుంటంది,..మిగతా వేళ్ల కదలికలను పరిశీలించండి,
వాటి నరాల,కండరాల అమరికలను ఊహించండి,.

పటం-2


24 July 2013

తొక్కలు - 10

కవితలను ప్రేమించుమన్నా,.
మంచి కవిత్వం పెంచుమన్నా,.
ఒఠ్ఠిరాతలు కట్టిపెట్టోయ్,..
గట్టి కవనం రాయవోయ్,..


తిండితో పాటు,నంజుడికి ఓ బుర్ర దొరికింది,.
ఇంకేం కావాలి,. జీవితానికి
,...

కుంభవృష్టి,.
చిత్తడై పోయింది,.
బతుకుచిత్రం
,..

ఎప్పటికి మిగలలేని చోట కూడా,..
ప్రతిది మిగుల్చుకోవాలనుకుంటాం,...

రానిపని



మబ్బుల్ని తరిమేసి
తడిచిన పచ్చికపైన,,.కూర్చొని
అప్పుడు,. ఆ ఏకాంతవేళ
వెన్నెల్లో మెరుస్తూ,.
కవితాకాగితాల కట్టలు ముందేసుకోని,
నెమ్మదిగా ఒక్కొక్కటి చించుతూ,..
చిరాకుని కనబడనివ్వని,
ప్రశాంతమైన చిరునవ్వుతో,..
అంటుంది తను,..
నువ్వు రాసేదేది కవిత్వమే కాదంటే,.
నువ్వు రాసేదంతా చెత్తంటే,..
నువ్వేమంటావ్, ఇప్పుడు అని,..

నాకు తెలుసు,.
కవిత్వం గురించి నాకేమి తెలియదని,
 రాయడం,.నాకెప్పటికి చేతకాదని,.అంటూ,.
కాస్తంత దగ్గరకు జరిగి,.
తన నుదిటిని ముద్దాడి,.
ఇలా అంటానప్పుడు,.
నేను రాయగల అతి గొప్ప కవిత్వం ఏదైనా వుంటే,.
అది ఇది మాత్రమేనని,...


22 July 2013

ప్రశ్నలు


స్వప్నాల కాష్టం నుంచి,
ఏ అగ్ని జ్వలించదేం?

రగిలించే రుక్కుల నుంచి,
ఏ రక్తం స్రవించదేం?

ఏ మౌనపు రాగం నుంచి,
ఏ శిశువు జనించదేం?

శుష్కంచిన భావం నుంచి,.

ఏ కవిత వెలువడదేం?

21 July 2013

తొక్కలు - 9

ఒక్కో దాన్ని అతికించుకుంటూ,.
ఆకాశహర్మ్యాలు నిర్మించుకుంటూ,.
బతకటమంటే అదిరా అంటావు,.నువ్వు,...

అన్యేషిస్తూ,.పయనిస్తూ,.
ప్రతిదాన్ని పగల కొట్లుకుంటూ,..
దాన్నే జీవితమంటాను,.నేను
,.
--------------------------------

దృక్పధం అనేది దారిలాంటిది,..
బతకడానికి బాగుంటుంది,,.
బంధించినప్పటికి,. ఆలోచనా స్వేచ్ఛను.,

20 July 2013

చార్లెస్ రాబర్ట్ డార్విన్

చార్లెస్ రాబర్ట్ డార్విన్
(ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 19, 1882)

తండ్రి దృష్టిలో పనికిరాని వాడు.. ఉపాధ్యాయుల మాటల్లో మందబుద్ధివాడు.. ఇలా విమర్శల మధ్య ఎదిగిన ఓ కుర్రాడు.. అసలుమనిషి ఎలా పుట్టాడో చెప్పగలిగాడు! అతడే డార్విన్‌! 
ఆ బాలుడు ఎప్పుడూ బొద్దింకలుగొంగళి పురుగులుసీతాకోక చిలుకల్లాంటి జీవుల్ని జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి తెచ్చేవాడు. వాటికి తిండి పెడుతూపరిశీలిస్తూ కాలక్షేపం చేసేవాడు. ఇంట్లో ఎక్కడైనా దుర్వాసన వస్తే ఆ కుర్రాడు తెచ్చిన ఏ జీవో చచ్చి ఉంటుందని పెద్దవాళ్లు వెతికేవారు. అలాంటి కుర్రాడు పెరిగి పెద్దయ్యి ఈ భూమిపై జీవరాశులు ఎలా ఉద్భవించాయోఎలా పరిణామం చెందాయోమానవుడు ఎలా పుట్టుకొచ్చాడో సాధికారికంగా చెప్పగలిగాడు. మానవ విజ్ఞానాన్నే మలుపు తిప్పిన గ్రంథం 'ద ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీసీస్‌'రచించాడు. అతడే ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌.
డార్విన్‌ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో పుట్టాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదు. తండ్రి వైద్యవిద్య కోసం ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేర్చినా డార్విన్‌ కొనసాగించలేకపోయాడు. ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్‌లో తత్త్వశాస్త్ర అధ్యయనంలో చేరినా అక్కడా అంతే. అక్కడి ప్రొఫెసర్‌ ఓసారి అతడికి 'బీగల్‌అనే ఓ నౌక కెప్టెన్‌కి పరిచయం చేశాడు. వివిధ దేశాల్లోదీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్‌ తన తండ్రి వద్దంటున్నా వినకుండా ఆ ఓడ ఎక్కేశాడు. ఆ నౌకాయానంలో డార్విన్‌ అనేక ప్రాంతాల్లో మొక్కలురాళ్లుశిలాజాలు,కీటకాలుజంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు. ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు. 150 సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది. జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదనిఅవి వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక (natural selection) ద్వారా పరిణామం చెందాయని డార్విన్‌ సిద్ధాంతం చెబుతుంది. 

చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం (Darwin's theory of evolution)భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి కోతి నుంచి వచ్చాడుమనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది. మలేషియా నుంచి రసెల్ వాలేస్ (1823- 1913) అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి. డార్విన్1844లో తన రచననువాలేస్ పంపిన వ్యాసాన్ని లియన్ సొసైటీ జర్నల్‌కు అందచేశాడు. 1858 జూలై15న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఇరువురి వ్యాసాలు పరిశీలించారు.
1844లో డార్విన్ మొదలు పెట్టగావాలేస్ 1858లో రాశాడు.
కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు.


                             ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాలప్రాణులు  మొదటినుంచీ లేవనేది ఈ సిద్ధాంతంయొక్కప్రధానమైనవాదన.కుక్కలూనక్కలూతోడేళ్ళూ ఒక జాతివనీపిల్లులూ,చిరతపులులూపెద్దపులులూసింహాలూ మరొక జాతికి చెందినవనీగుర్రాలూగాడిదలూజీబ్రాలూ ఒకలాంటివే. గతంలో వీటికి తలొక "పూర్వీకుడూ" ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ "ఆదిమ" శునకానికీ,మార్జాలానికీఅశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ,తక్కిన చేపలూతాబేళ్ళూజలచరాలూపక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగానూమరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూపర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్నిరకాల ప్రాణులు "వాటంతట అవే" ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది.

ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవజాతి క్రమంగా ఉత్తరదిశగానూతక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్య్టా తొలిమానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్లరంగులో ఉన్న ఒక మానవసమూహం తెల్లగా మారిపోవడానికి 20 వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా. మనిషిజాతినే తీసుకుంటేచర్మం రంగూముఖకవళికలూ అన్నీ కాస్తకాస్తగా మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోంది. దీని కారణంగానే జీవపరిణామ సిద్ధాంతాన్ని కాదనేవారు ఎక్కువ సంఖ్యలో లేరు.
చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్ లో డార్వినిజం ఎన్నో ప్రశంశలు అందుకుంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలనిజీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి ఆధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.
కొన్ని క్రైస్తవఇస్లామిక్ దేశాలలో డార్వినిజం చాలా వివాదాస్పదమయ్యింది. సృష్ఠివాదాన్ని వ్యతిరేకించడం దైవ ద్రోహం అని మతవాదుల వాదన. కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఇప్పటికే ఈ సిధ్ధాంతాన్ని నిషేదించారు. 

                       సేకరణ - -డాక్టర్ శేషగిరి గారి వ్యాసాలనుంచి    https://sites.google.com/site/scientistsintelugu/

19 July 2013

తొక్కలు -8



విషయం తెలీనప్పుడే,
ఎందుకో, మరంత స్పష్టంగా వుంటాం,.

వచ్చిపడే వేల డబ్బు లెక్కలోకేరాదు,.
జారిపోయే పావలకాసు ప్రాణం తీసేస్తుంది,.

కమ్యూనికేషన్ల కాలం కదా,.
పరిచయాలే పాపులర్ చేసేస్తాయ్,.ప్రతిభ కంటే,..

ఘర్షణలేకుండా చలనాలు,.
సంఘర్షణ లేకుండా మార్పులు,.ఊహించుకోకు,.


తెలిసిన పదాలే పదిపైన కొన్ని,.
రాసిన రాతలు మాత్రం చదవలేనన్ని,.