మా స్కూలు పిల్లలతో కవిత్వం రాయిద్దామని ఒక ప్రయత్నం చేద్దామిని ఇచ్చిన ఫార్మెట్ ఇది,..
అలా వుంటాయ్,
ఇలా వుంటాయ్,
అలావున్నా,ఇలావున్నా,
ఎలాగోలా ఒదుగుతుంటాయ్.,
మీరు కూడా ఓ ప్రయత్నం చేసి ఇలా ఓ చిన్న కవిత పెడితే ,.ఆనందిస్తాను,..చాల సింపుల్ గా రాయచ్చు.
నేను రాసిన కొన్ని ఇవి,.,.
--------------------------------------
వినకుడని శబ్ధాలుంటాయ్,
వినాల్సిన
నిశ్శబ్ధాలుంటాయ్
విన్నా
విననట్లు,వినకపోయినా వినినట్లు
శబ్ధాశబ్ధాల మధ్య
నలగాల్సిన పరిస్థితులూ వుంటాయ్.
తెలుసుకోవలసిన
విషయాలుంటాయ్,
తెలుసుకోకుడని
సంగతులుంటాయ్,
తెలిసినా తెలియనట్లు,
తెలియకపోయినా తెలిసినట్లు,
నటిస్తూ, జీవించాల్సిన
సందర్భాలూ వుంటాయ్.
మాట్లాడాల్సిన మాటలూ
వుంటాయ్,
నోరు నొక్కాల్సిన భావాలూ
వుంటాయి,
ఎక్కడిమాట అక్కడ
మాట్లాడి,
ఉత్తముడిగా మిగలాల్సిన
సమయాలుంటాయ్.
చర్మాన్ని చిరునవ్వులు
చిందిచేవి వుంటాయ్,
చివుక్కుమనిపించే
స్పర్శలూ వుంటాయ్,.
తాకినా, తాకకపోయినా
హృదయాన్ని స్పృశిస్తు
హత్తుకుపోయే క్షణాలుంటాయ్
చూడాల్సిన ఛండాలాలు
వుంటాయ్,
వీక్షించకూడని సౌందర్యాలుంటాయ్.
చూసినా చూడకపోయినా,
దృశ్యాదృశ్యాల మధ్య,
ఆవిష్కరించబడే
అద్భుతాలుంటాయ్.
రుచించేవి వుంటాయ్,
ఎప్పటికీ రుచిచూడకుడనివి
వుంటాయ్.
నోట్లో వేసుకున్న
వేసుకోకపోయినా,.
మనసుతోనే ఆస్వాదించాల్సిన
కొన్ని రుచులుంటాయ్.
ఎన్నితరాలు గడిచినా,
మనల్ని అంటిపెట్టుకొనే వాసనలుంటాయ్,
కొత్తగా ముసురుకునే
కొన్ని తత్వాలుంటాయ్,.
ఎగబీల్చి గుండెల్లో
నిలుపుకోవాలో,
చీది బయటపారేయాలో,
విచక్షణతో తీసుకోవలసిన
నిర్ణయాలుంటాయ్.
అర్థమయ్యే రహస్యాలుంటాయ్,
అర్థంకాని
సామాన్యాలుంటాయ్.
అర్థం కాకపోయినా
సంతోషాన్ని,
అర్థమయ్యి బాధను
మిగిల్చేవి వుంటాయ్,.
అదృష్టవశాత్తు,అప్పుడప్పుడు,
అర్థాన్ని, సంతోషాన్ని
ఒకేసారి వడ్డించే,
కొన్ని ఘటనలు
ఎదురవుతుంటాయ్.
-------------------------
ఇలా ఎన్నయినా రాసుకోవచ్చు
.....ఉదాహరణ...
టి.వి.లు వుండే ఇళ్లు వుంటాయ్,
టి.వి ఎరగని ఇళ్లు వుంటాయ్,.
టి.వి. వున్నా లేకున్నా,
ప్రతి ఇంట్లో కొన్ని సీరియల్లు నడుస్తుంటాయ్,.
------------------------------
మీరు ఒకటి కామెంటు లో రాసేయండి,
జలతారు వెన్నల గారు ఇలా రాశారు,.మరిమీరో....
మనసు స్పందిస్తే ఆనందించే సందర్భాలుంటాయ్,
మనసు లేక పోయినా స్పందిచాల్సిన సందర్భాలుంటాయ్,
సందర్భం ఎలాంటిదైనా, స్పందించినా, స్పందించకపోయినా,..
మనసు కంటే మెదడు చెప్పినట్లు నడుచుకొనే
సందర్భాలే ఎక్కువ వుంటాయ్
జలతారు వెన్నల గారు ఇలా రాశారు,.మరిమీరో....
మనసు స్పందిస్తే ఆనందించే సందర్భాలుంటాయ్,
మనసు లేక పోయినా స్పందిచాల్సిన సందర్భాలుంటాయ్,
సందర్భం ఎలాంటిదైనా, స్పందించినా, స్పందించకపోయినా,..
మనసు కంటే మెదడు చెప్పినట్లు నడుచుకొనే
సందర్భాలే ఎక్కువ వుంటాయ్