Pages

15 November 2012

వ్యాఖ్య


ఎందుకో ఒకందుకు,
ఎవరో ఒకరి చేత,
అర్థమైనా,అర్థంకాక పోయినా,
వ్యాఖ్యానించబడుతూనే వుంటుంది,
 జీవిత గతి తార్కిక క్రమం.
సరళంగానో, పరుషంగానో
అనుకూలంగానో, వ్యతిరేఖంగానో
ఆగ్రహమో, వ్యంగ్యమో,హాస్యమో,.
ఎలాగో ఒకలాగా, అనునిత్యము,.
నీ ఎంపిక ఎలా వుంటుందో,
నీ జీవితం అలా వుంటుందని,
కళ్లు మూసుకోనైనా వ్యాఖ్యానించచ్చు..

16 comments:

  1. వ్యాఖ్యలన్నీ నిజం కావంటారా భాస్కర్ గారు?

    ReplyDelete
  2. మన బ్లాగ్ వాఖ్యలు కాదు చిన్ని గారు, జీవితం గురించి రాసానట్టు లేదా,ఇది, ..వా..
    వాఖ్యల్లో నిజమున్నా, అబద్దమున్నా మనమెలా స్వీకరించమనేదే,. మనల్ని నిర్ణయిస్తుందనేమో ....నా అర్థం...ధన్యవాదలండి.

    ReplyDelete
  3. భాస్కర్ గారు, జీవితంలో మనకు వచ్చే వ్యాఖ్యల గురించి చెప్పారని అర్థమైంది, దాన్ని ఇంకా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. చిన్ని గారు, మళ్ళీ వచ్చి వ్యాఖ్యని చదివి, మరో సారి పలకరించినందుకు ధన్యవాదాలండి.

      Delete
  4. చేసే వ్యాఖ్య బ్లాగ్ లోనైనా...ఫేస్ బుక్ లోనైనా...జీవితంలోనైనా...ఇంకెక్కడైనా ...
    అది చేసేవారి మనసుకి నిలువెత్తు దర్పణం...
    ఏమంటారు భాస్కర గారూ!@శ్రీ

    ReplyDelete
    Replies
    1. బ్లాగులో,ఫేస్ బుక్ లో అభినందించినంత సులభంగా ఒకరిని జీవితంలో అభినందిస్తారని నేను అనుకోవడంలేదండి. ఖచ్చితంగా తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా సానుకూలంగా మాట్లాడటం గొప్ప విషయమే, ఒక వ్యాఖ్యకి మనమెలా ఫీలవుతున్నామనేదే, మన జీవితానికి ముఖ్యమని నా భావము శ్రీ గారు.

      Delete
  5. not necessary bhaskar there might be a difference between preaching and doing

    ReplyDelete
    Replies
    1. చెప్పడం,చేయడం గురించి కాదేమో తనోజ్ గారు నేను రాసింది,..ఎదుటివారు మన గురించి చేసే సూచనలు,వ్యాఖ్యలు లాంటివి మనమెలా తీసుకోవడం గురించేమో,అదే మన జీవన శైలిని, వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుందనమోనండి,ధన్యవాదాలు తనోజ్..

      Delete
  6. just read your vyakthithvam ammabadunu one more time .its awesome man

    ReplyDelete
  7. మళ్లీ చదివి అభినందించినందుకు ధన్యవాదాలు తనోజ్,.

    ReplyDelete
  8. బాగా చెప్పారండి.
    చివరిమాట ఒప్పుకోలేనండి. ఎంపిక మీదే ఆధారపడి ఉంటుందనుకోను.

    ReplyDelete
  9. వాస్తవాన్ని గుర్తుంచుకుంటే చాలండి,ఎక్కువగా పొంగి పోకుండా, మరీ కుంగకుండ....
    , ఒప్పుకోకపోయినా ఫరవాలేదండి,.నేను రాసేవన్ని నిజలవుతాయా ఏంటి,,,.చదవి అభినందించినందుకు ధన్యవాదాలు లక్ష్మీదేవి గారు

    ReplyDelete
  10. నీ ఎంపిక ఎలా వుంటుందో,
    నీ జీవితం అలా వుంటుందని baagaa cheppaaru

    philosophy of life



    ReplyDelete
    Replies
    1. ఎందుకో ఏమో గారు,ధన్యవాదాలండి,.లోపలి విషయాలు చెప్పాలంటే కష్టమేనండి,..

      Delete
  11. hmmm... " ఎంపిక ఎలా వుంటుందో,
    నీ జీవితం అలా వుంటుందని,
    కళ్లు మూసుకోనైనా వ్యాఖ్యానించచ్చు.."
    నిజమే! బాగుంది భాస్కర్ గారు

    ReplyDelete
    Replies
    1. ఎంపికను బట్టే వుంటుదేమో జీవితం అని అలా రాసానండి,.నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నల గారు.మీరు కూడా ఓ కవిత రాయచ్చు కదా....ఎందుకని ఏమి రాయడంలేదు.

      Delete