Pages

11 November 2012

ఎదురు చూపు



రాత్రంతా, ఆకసాన,
అలా వేలాడుతూనే,.
దినకరుని జాడకై,
మిణుకుమిణుకుమంటూ
ఎదురుచూసి, చూసి,.
ఆ తారకలు,
అతని రాకా అలికిడికే,
తమ సర్వస్వాన్ని అర్పించినట్లు,
నీ తలపుల అలకిడికే,
అంకితమైపోతున్నా, సుమా,..
నేను నీకు,నిరంతరమూ...
ధీర్ఘమైన నీ మౌనపు కుంచె కూడా,
నా హృదయానికి రంగులద్దుతూనే వుంది సుమా......

14 comments:

  1. Replies
    1. మంజు గారు ధన్యవాదాలండి.

      Delete
  2. మరో చరిత్ర సినిమాలో పాట గుర్తుకొచ్చింది ఈ కవిత చదివితే..
    "ఎదురు చూపులు ఎదను నిండగా ఏళ్ళు గడిపెను శకుంతల
    విరహ బాధను మరచిపోవగా నిదురపోయెను ఊర్మిళా

    ReplyDelete
    Replies
    1. వెన్నల గారు, సినిమా చూసాను కానీ పాట గుర్తుకురావడం లేదండి.,మంచి సినిమాను గుర్తుచేస్తూ అభినందించినందుకు ధన్యవాదాలు, మీరేం రాయడం లేదు, ఎందుకనో...

      Delete
  3. Replies
    1. సుభ గారు ధన్యవాదాలండి,..

      Delete
  4. బాగుందండీ.

    ReplyDelete
    Replies
    1. చిన్ని గారు, మీ అభినందనకు ధన్యవాదాలండి.

      Delete
  5. last 2 lines ki ee poem ki connection elano cheppandi plz

    ReplyDelete
    Replies
    1. నువ్వు దూరంగా ఎక్కడో మౌనంగా వున్నావు, నీకంకితమై పోయిన నా హృదయంనికి, నీ జ్ఞాపకాలు కూడా ఆనందన్నిస్తున్నాయి,.. అనేమో....ఆ రెండు లైన్లు పైన వుంటే బావుండేదేమో..

      Delete
  6. రంగులద్దిన కుంచె నుండి అందమైన బొమ్మ ఏదో మరి:-)

    ReplyDelete
    Replies
    1. హ,హ,..పద్మార్పిత గారు, నాకు బొమ్మలేయడం అసలు రాదండి,..అన్నీ బొమ్మలు కనుల వెనుకే కదలాడుతుంటాయ్,
      ధన్యవాదాలండి,..

      Delete
  7. super bhaaskar gaaroo!...మీకు దీపావళి శుభాకాంక్షలు...@శ్రీ

    ReplyDelete
  8. శ్రీ గారు, బాగున్నారా,..ధన్యవాదాలండి,..మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు

    ReplyDelete