happy 2000 visits day
ఫిబ్రవరి నెల 2వ తేదిన మొదలైన ఈ బ్లాగ్ నిదానంగా
మీ అందరి ఆదరణతో ఈ రోజుకి 2000 వీక్షణలను దిగ్విజయంగా పూర్తిచేసుకొన్న శుభసందర్భంగా
ఈ బ్లాగ్ ను సందర్శించిన అందరు మిత్రులకి, వీక్షకులకు, పాఠకులకు నా హృదయపూర్వక
కృతజ్ఞతలు. దీన్ని మొదలుపెట్టడానికి కారణం, నేనా రోజు ఆంధ్రభూమి దినపత్రిక చూడటమే,
దాన్లో బ్లాగింగ్ చాల సులభం అనే ఆర్టికల్ చదివి పొరపాటున, దీనికి ఇలా బలైపోయాను.
ఇదొక పిచ్చి,కవితల పైత్యం దానికి తోడయింది.
ఈ గోలెందుకులేండి,మళ్లెప్పుడైన చూద్దాం.
మన దేశం (1364), అమెరికా(472),
రష్యా (105 ) ,
సింగపూర్(14), జర్మని(11), ఇంగ్లాండ్(11), ఆస్ట్రేలియా(11), మలేషియా(3),థాయిలాండ్(3),
దుబాయ్(2),
మెక్సికొ(2),చైనా(2) దేశాల నుంచి
వీక్షించి,చదివినవారికి నా ధన్యవాదాలు.
ప్రత్యేకంగా ప్రస్తావించవలసినవారు
నా రాతలపై కామెంట్లు రాసినవారు. దగ్గర దగ్గిర, ప్రతీ దానిని చదివి
నా కవితలపై నాకు కూడా కొంచం నమ్మకం కలిగేటట్లు,
ప్రోత్సహిస్తున్నజలతారు వెన్నల గారికి
చాల చాల థాంక్యూలు చెప్పాలి.
నా నానీలపై ఆమె
రాసిన ఒక నానీ ,
బ్లాగులలోకంలో,
భాస్కర్ గారి నానీలు.
చదవాలి తప్పకుండా
స్నేహితులందరు! .
మొదటి కామెంట్
రాసిన రవిశేఖర్ గారికి కు,
విజయ్ మోహన్ గారికి , కెక్యూబ్ వర్మ గారికి,
పద్మార్పిత
గారికి, సందీప్ గారికి,
జిలేభి గారికి,రసజ్ఞ గారికి, కల్యాణ్ గారికి,
శ్రీ గారికి, శృతి
రుద్రాక్ష్ గారికి, ఆదిత్య గారికి నా
కృతజ్ఞతలు.
చెల్లి జ్యోతి రాసిన ఒక నాని కూడా చెప్పాలి.
This is Bhaskar's chelli's
first "Neena" on Bhaskar.. check it out..
Nuvvu...
Enni thittina ade navvu,
Nenu vesindi churake ayina..
neeku matram adi gaddi parake!!!!!
నా బ్లాగ్ ని
వెంటాడే మిత్రులు రవిశేఖర్,
రాజశేఖర్, శ్రీనివాస్ , జ్యోతి,
తమ్ముల్లు
రాజా, కిరణ్ లకు,మా ఆవిడకు, పిల్లలకు,
అమ్మనాన్నకి నిరంతర అభినందనలు.
ఇక నా పోస్ట్ లలో మొదటి మూడు స్థానాలలోని వున్నవి
1.మా ఆవిడ నానీలు (62)
2. నాకై.....(దీన్ని చదవనవసరం లేదు) (52)
3. ఐదు బ్లాగులు – ఐదు నానీలు (36 )
నాకైతే బాగా నచ్చింది " చిక్కుల్లో చిన్నారి"
అగ్రిగేటర్స్ హారం,సంకలిని లకు నా పోస్ట్ లను
అందరికి చూపుతున్నందుకు ధన్యవాదములు.
కూడలి,మాలిక, జల్లెడ లలో ఇంకా చేరలేదు.
ఓ ముప్పై మూడు మందిని నేను వెంటాడుతున్నా,
వాళ్లెవరు నా వంక చూస్తున్నట్లు లేదు. వాళ్లూ ఎప్పుడైన ఇటు చూస్తే మరంత ఆనందంగా
వుంటుంది కదా! అనిపిస్తుంది.
మరోసారి అందరికి
రెండు వేల వీక్షణల దినోత్సవ శుభాకాంక్షలు.