101
తిండితో
పాటు,
నంజుడికి
ఓ బుర్ర దొరికింది,.
ఇంకేం
కావాలి,.
జీవితానికి,...
102
మోయాలి,.
మోయించుకోవాలి.,.
మోత
మహోన్నతం,
తెలుసుకోవాలి,..
103
ఒక
రోదనతో మొదలై
కొన్ని
ఏడుపులతో
ముగిసిపోతుంది
జీవితం.
104
ఎంత
కప్పినా తప్పును
గిల్టి
కాన్షస్
గిల్లుతూనే
వుంది.
105
వ్యాకరణాన్ని వెతికి
వాక్యానికి విలువకట్టే
వాడు
పండితుడనుకోకు
106
జీవితాన్ని
నువ్వంగీకరించలేవు.
జీవితం
నిన్ను
ప్రతిఫలించలేదు.
ఓహ్, ఎంత
దురదృష్టం.
261015
107
నువ్వు
మనుషుల
గురించి మాట్లడతావ్
నాకు
జంతువులే
గుర్తొస్తుంటాయ్
క్షమించు,..
108
మనసులోపల
నీకు విషమెంత వున్నా,..
మాటలలో
మర్యాద,
మన్ననలనిచ్చు
వినుకోరా
చిన్నా,..లోకం తీరు కనరా కన్నా,..
109
కాలమెన్నడు
నీకు కలసి రానే రాదు,.
తెగువ
లేక నువ్వు బతికినప్పుడు,...
వినుకోరా
చిన్నా,..లోకం తీరు కనరా కన్నా,..
110
ఘర్షణలేకుండా
చలనాలు
సంఘర్షణ
లేకుండా మార్పులు
సులభమని ఊహించుకోకు.
అందులోను
ఇట్లాంటి
చోట్ల.
111
బడికి పొమ్మంటే
ఏడుస్తుంది అజ్ఞానం.
ఎంత
పసి హృదయం!
112
అమ్మఒడి,
కమ్మనిబడి
రెండు స్వర్గాలు భూమి మీద.
113
ఆలోచనలు పసిపిల్లలు
ఎటుపోతాయో
వాటికే తెలియదు.
114
స్వార్ధం చెప్పే సుద్దులు
స్థిర పడుతున్నాయ్.
సర్దుబాటు
సాధ్యమేనా!
115
గమ్యమెప్పుడో
నిర్ణయించబడే
వుంది.
దిగులంతా
దారి
గురించే.
251015
116
ప్రశ్నించడం గొప్ప మలుపన్నా !
బలుపు కాదా?
అన్నాడు, ఇంకొకడు.
117
భుజం పై బరువు మోయలేకేమో
స్పందనలనిప్పుడు
బాల్యం వదుల్తుంది.
118
ఎక్కడోడో
అయితే
పొగిడి
పైకెక్కిస్తాం,.
పక్కనోడైతే
ఏకిపారేస్తాం,..
119
నువ్వెవ్వడివనేది
నిర్ణయించుకొనే
కొద్దీ
లేదా
నిర్ణయించబడే కొద్దీ
నువ్వు
జీవించే చోటు
కుంచిచుకుపోతుంటుంటుంది.
281015
120
ఆరామ్గా
కూర్చొని
ఖుషిచేద్దామనుకున్నప్పుడు
దునియా
మొత్తం తిప్పేస్తాది.
ఉత్సుకతతో
శక్తినంతా కూడదీసుకొని
లోకాన్ని
తిరిగేద్దామంటే
కట్టడి
చేసి, ఓ మూల బంధీని చేసేస్తుంది
జిత్తులమారి
కదా,.
ఈ జీవితం.
121
స్థిరత్వం
సహజమా,
అసహజమా
విడమర్చుకొని
చెప్పుకుంటున్నా అర్థంకాలా.
విఫల
తాత్వికతల
సఫల
ప్రయాణమా ?
లేక
సఫల
తాత్వికతా విఫల ప్రయాణమా?
ఏమో!
అంతా ఉత్త
ఆలోచనలే,
కేవలం
నిమిత్తమాత్రుత
అంతకంటే
ఏం లేదు
జీవితం
311015
122
మోసం
చేయాలనుకున్నప్పుడు.
ముందు,
నమ్మకంగా
కొన్ని మాటలు చెప్పాలి.
మొత్తంగా
దోచుకోవాలనే
దూరదృష్టున్నప్పుడు
భ్రమల
మానియాల్లో
మెదడుని
ముంచేయ్యాలి.
టార్గట్కి
అర్థమవ్వనంత వరకు ఓ.కే.
ఖర్మకాల్తే,
ఆ తరువాత కథ మారిపోద్ది.
123
నేను
నమ్మే
అబద్దం
పట్ల
నాకు
విశ్వాసం వుంది.
నిజం పట్ల
నీకున్న
గౌరవంకంటే
ఎక్కువగా.
124
భావం
స్థిరపడటం
బలం అనుకోకు.
గుంజకు
కట్టబడ్డ
గానుగెద్దే
ఇక, ఆ తరువాత
041115
125
మాటల్లో
సుమూర్ఖత్వమో
వాక్యాల్లో
సుమేధావీతనమో
సమజ్
కాకపోతే సమస్యేం లేదు.
అవకాశవాదం
అర్థం
చేసుకోచాలు,
లక్షణంగా
బతికిపోతావ్.
031115