1
ఆ ఒక్క పదం వుంది చూసావు,.
నిన్నెల
ఆకట్టుకుంటుందో,.
నిన్నెల
నిలబెడుతుందో,.
నిన్నెల
చంపేస్తుందో,.
ఆ ఒక్క బక్క
పదమే,.
బహుశా నువ్వెప్పుడు,.
దాన్ని
గురించి ఆలోచించికూడా వుండవు..,
ఆలోచించినా,.నవ్వుకొనెవుంటావు,.
2
మాటల పట్ల
ప్రత్యేక ప్రేమేం లేదు,.
కాని,.కొన్ని
సార్లు ఎవరైన వుంటే,.
మాట్లాడాలనిపిస్తుంది,.
చాలా
సార్లు,. తొందరగా తప్పించుకోవాలనిపిస్తుంది,.
మౌనంగా
మిగలడంలోని సుఖాన్ని తలుచుకోవడం,.
మాటలేలేని
జీవితం ఎలా వుంటుందో,.
నిజంగా,.చాలా
కష్టమైన పని మాట్లాడం,.
3
ఒక్క భావము
లేక,. ఒక్క స్పందన లేక,.
హృదయ శ్మశానన
మొలిచే మాటలనో,.
అనాథలైన
పదాలనో కూడగట్టుకుని,.
సంద్రంలాంటి,.జీవితాన్ని
దాటల్సోచ్చినప్పుడు,.
ఖచ్చితంగా
మునిగిచావాలనిపిస్తుంది,.
అంటిపెట్టుకున్న
నీ నవ్వుకొటి,
పట్టుకున్నట్లున్నాను,.
కొట్టుకెళ్లిపోతున్నాను,,.ఈ
కనిపించని అలలమధ్య