Pages

21 October 2013

స్వేచ్ఛాగీతం



1

సోదరా! మనకిక్కడ స్వేచ్ఛుంది,.
ఏ ప్రకరణం ప్రకారమో,.తెలయదుకాని,
ఏ అధికరణంఏం చెబుతుందో కాని,
పట్టిపట్టి చదవకపోయినా,
రాజ్యాంగపు ప్రతి పుటను,....
చూస్తున్న ప్రపంచం,
చెబుతున్న దాన్ని బట్టి,.
బల్లగుద్ది మరీ చెప్పచ్చు, 
తమ్ముడూ,.మనకిక్కడ స్వేచ్ఛుంది,..


2


నడిరోడ్లో బండి అడ్డమెట్టి,
వరాహబృందపు చర్చలు సాగించవచ్చు,
అదేమని అడిగినోన్ని,
వెధవను చేయను వచ్చు,..
పగలబడి నవ్వుతూ,
సెల్లులో సొల్లాడుతు,
50 ప్రాణాలు ఫణంగా పెట్టి,

60 మైళ్ల వేగంతో బస్సును నడపనువచ్చు.

ప్రేమపేరుతో అమ్మాయిలను వంచించచ్చు,
కావాలనుకున్నప్పుడెప్పుడైనా,
యాసిడ్ పూజలు చేయనువచ్చు.
పాతవిలువల వలువలనిప్పి,
కొత్త సొబగులు అద్దనువచ్చు,.
సోదరా! మనకిక్కడ స్వేచ్ఛుంది,.


3

చీప్ లిక్కర్ తాగుతావో,
పురుగుల మందేస్తావో,
చిత్తుకాగితాలేరుతావో,
బొచ్చెత్తుకు అడుక్కుతింటావో,.
లంచాలు గుంజుతావో,
నాయకుల తొత్తవుతావో,
వేయిరూపాయలకే ఓటమ్ముకుంటావో,
కమీషన్లతో కోట్లు కూడబెడతావో,.
మెరుగైన సమాజమంటూ,
మెదళ్లుకు చెదలెక్కిస్తావో,.
నమ్మకంగా నమ్మించిముంచుతోవో,..
నిన్ను నువ్వు తగలెట్టుకుంటావో,.
ఏదైనా చేస్కో,.
తమ్ముడూ!,. నీకిక్కడ స్వేచ్ఛుంది,.


4


విషపు బీజాలు నాటుకుంటూ,
బలంగా బలహీనపడతావో,
బలహీనంగా బలపడతావో,..

562 రాజ్యాల భావోద్వేగాల సాక్షిగా,

చీల్చుకుంటావో,కలుపుకుంటావో,.
నానా చెత్తా రాస్తూ, 
కవిత్వమని భ్రమపడతావో,.

ఏమైనా చేస్కో,.ఏదైనా రాస్కో,.
సోదరా!,.నీకిక్కడ స్వేచ్ఛుంది,.మితిమీరిన స్వేచ్ఛుంది.

2 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు పద్మార్పిత గారు,.

      Delete