నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకోవడానికి కొద్దిపాటి జ్ఞానం చాలు, జ్ఞానిని అని చెప్పుకోవడానికి చాల మూర్ఖత్వం కావాలి.
7 May 2012
25 April 2012
ద్విపదలు
అనుభూతుల్లో పదాలు, పదాల్లో అనుభూతులు,
వెతికేవాడు, వెర్రివాడు.
--------------
ఏ దేవుడు శపించాడో !
పిల్లల
జీవితం పుస్తకాలకు
బలిమ్మని.
---------------
ఆరోగ్యం గుట్టు విప్పి చెప్పేవాడు.
హార్ట్ స్ట్రోకొచ్చి, పాపం! హాస్పెటల్ లో…..
------------------
వేదికల ప్రశ్నలు చేపమందుకే.
చానళ్ల నిండా అశాస్త్రీయతా, గబ్బే.
---------------------
గోడ మీద పేరు దాతృత్వం.
గుండె పొరల్లో దాని పేరు, దైవత్వం.
24 April 2012
నానీలు -10(ఐదు బ్లాగులు – ఐదు నానీలు)
“హృదిలో మెదిలే
రవిశేఖర్” తలపులు,
జలపాతపు
జల్లులు.
---------------------------
కొత్త కవిత్వం,
కామెంట్లు
కరువు.
వానై
కురిసింది,
“జలతారువెన్నల”.
-----------------------------
“వెన్నల, దారి”ని
ఆక్రమిస్తూ,
గుండె పొరల్లో చొరబడింది.
నిశ్శబ్ధంగా.
--------------------------
తనివితీరా
తనువంతా తడుముతుంది,
“పుట్టుమచ్చ”
పరిమళం.
-----------------------
కలల్ని వేటాడే
“లిఖిత” కవిత్వం,
ఫరిదాకి మాత్రం
ఎందుకో నిషిద్ధం.
-------------------------
వీడియో - 10 (అమెరికాలో మంచి లొకేషన్ )
చిన్న వీకెండ్ ట్రిప్, అమెరికాలో మంచి లొకేషన్ చూద్దామా
23 April 2012
పర్యావరణమంటే…(కవిత - 8 )
పర్యావరణమంటే….
చెట్టు,
చేమ
గాలి, ధూళి
నింగి,
నేలా
నీరు,
నిప్పు
వాగు,
వంక
ఇవే కాదోయ్
పర్యావరణమంటే
నువ్వు,
నేను కూడా!
నానీలు - 9 (మా ఆవిడ )
మా ఆవిడ
చిమ్ముతుంది.
ఇల్లు కాదు.
మధురమైన జ్ఞాపకాల్ని.
--------------------------
భరించేది భర్తంటే
నవ్వింది.
బాధించేది భార్యంటే,
బతుకు బస్టాండైంది.
------------
అర్ధరాత్రైంది
ఎప్పుడూ
పనే,
నా సహచరి
నిశాచరి.
----------------------
బుస కొట్టని
పాములున్నాయ్.
నస పెట్టని
భార్యలెక్కడ?
----------------------
భావ కవిత్వం
రాసి మురిస్తే,
అదెవత్తని
మండింది,మా ఆవిడ.
ఎవరికి ఎవరు?( కవిత -7)
ఎవరికి
ఎవరు?
సగము విరిగిన
చందురిని పై,
జాలిపడువారెవ్వరు?
కడలిలోన
అలలు
విరిగితే,
విలపించువారెవ్వరు?
ప్రేమ లోన
మనసు చెదిరితే,
ఓదార్చువారెవ్వరు!!!!!
22 April 2012
వీడియో - 9(ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు)
ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు
చెట్లు నాటదాం - భూమిని కాపాడుకుందాం - అది మన భాద్యత
Lets go green to get our globe clean
Cut a Tree, Cut a Tree and there’ll
be no more left to see.
Less pollution is the best solution
అవీ ఇవీ - 3 (నా కవిత్వం)
అది 1990 ఎండాకాలం లో ఓ సాయంకాలం.
కవిత్వం గురించి చదవడం, వినడమేగాని,
రాయాలనిగాని,రాసే ధైర్యం గాని లేదు.
భాష పైన పట్టు, పదాలతో పరిచయంకాని
చాలా తక్కువ.(ఇప్పుడైన అంతేలేండి)
అప్పట్లో ఓ ఇద్దరు కవయిత్రులు పుంఖానుపుంఖాలుగా భావం తక్కువైనా,అందమైన
అక్షరాలతో వాళ్ల దృష్టిలో
అధ్భుతంగా రాసి నాపైన పారేస్తుండేవాళ్లు.
వాళ్లెవరో మీకీపాటికి అర్ధమైందనుకుంటాను.
అమాయకపు అక్క, (చి)చక్కని చెల్లి.
వీళ్ల దెబ్బకి నాలో ఆవేశం,ఉక్రోషం,కుళ్లు, అసూయ.
చీ..... వీళ్లేనా కవిత్వం తో కబుర్లు చెప్పేదని,
నేను కూడా రాయాల్సిందేనని శపధించుకొన్నాను.
ఇంకేముంది, పాత నోట్సులలో పేపర్లు,పెన్సిల్
తీసుకోని మిద్దెక్కాను.
రోజులు గడిచిపోయాయి.
ఎన్ని పేజీలు చినిగాయో,ఎన్ని పెన్సిల్లు ఆరిగాయో
మొత్తం మీద ఒకటో,రెండో కవితలు రాసి క్రిందకి దిగా.
అప్పుడు అంటుకొన్న కవిత్వం ఇప్పటికి
అప్పుడప్పుడు కాల్తూనేవుంది.
ఓ సంవత్సరం నా కవిత్వం దెబ్బకి వాళ్లిద్దరూ ఊరొదిలి వెళ్లిపోయారు.నేనూ,
నా కవిత్వం కంపు భరించలేక అటకపైన అట్టపెట్టలో ఆ నోట్సును భూస్థాపితం చేశా.
మొత్తం మీద అలా నా కవిత్వం లో మొదటి అంకం (90మార్చ్-91డిసెంబర్) ముగిసింది.
వీలైతే ఆ కవితల్లో కొన్ని పరిచయం చేస్తా.
ఇప్పటికి నా ఏ కవితైన వారు అంటించిన మంటే .
(సశేషం)
నానీలు - 8
కొత్త
కవిత్వం,
కామెంట్లు
కరువు.
వానై
కురిసింది,
జలతారువెన్నల.
--------------------------
బాగా రాస్తారండి
మీరు భలే,
గొప్పతనం
గుర్తించిన మనసుది.
---------------------------------
అల్లరికి,
అరక్షణం చాలు.
గాయం మాన్పాలంటే,
జీవితమివ్వాలి.
-------------------
దేవుడా !!
కలలాంటి జీవితమిమ్మంటే....
జీవితం లాంటి
కలలిచ్చాడు.
-------------------------------
అమాయకపు అక్క,
చిక్కని చెల్లి,
నా కవిత్వానికి
చెరో రెక్క.
(వివరణ కోసం అవీ ఇవీ – 3 చూడండి)
అమాయకపు అక్క,
చిక్కని చెల్లి,
నా కవిత్వానికి
చెరో రెక్క.
(వివరణ కోసం అవీ ఇవీ – 3 చూడండి)
---------------------------------------
కంపారిజన్ (కవిత - 6)
కంపారిజన్
చెరగని నవ్వు నీది,
చెదిరిన మనసు నాది.
తేలికయిన మనసు
తోటి,
తుళ్లుతున్నవలపు
నీది.
భారమైన వేదనతో,
కుంగుతున్నమనసు
నాది.
ఆ నింగిని తాకేటి,
మధురమైన
ఊహ నీది.
అగాధపు లోతుల్లో,
శిధిలమైన మనసు నాది.
21 April 2012
ఎవరు నువ్వు? (కవిత - 5)
ఎవరు నువ్వు?
సంధించిన
సంధిగ్ధపు
ఆలోచన రూపు నీవు.
సంఘర్షణ
సమరానికి
అంకురాగ్ని నీవు.
జారుతున్న
కాలానికి
జ్ఞాపకాల దివ్వె నీవు.
19 April 2012
నానీలు - 6
సమాజం
వేడుక చూస్తూంది.
పరువు బరువు
నా నెత్తిన పెట్టి.
-------------
ఆలోచనలు
పసిపిల్లలు
ఎటుపోతాయో
వాటికే తెలియదు.
-------------------
అమ్మ ఒడి
కమ్మని బడి
రెండు
స్వర్గాలు
భూమి
మీద.
-------------------
పర్యావరణం
మనిషి జీవితం
ఫుల్ స్టాప్ పెట్టడానికి
పాలథీన్ కవర్ చాలు.
----------------------
మహిమో,మాజిక్కో
ఏదైతేనేంగాని
దేవుడయ్యాడు,
మామూలు మనిషి.
----------------------
18 April 2012
వీడియో - 7( పుట్టిన రోజు)
రాజ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
12 April 2012
వీడియో - 6( twinkle twinkle)
మానస చెప్పే రైం వినాలనుకొంటే , చూడాలనుకొంటే .క్లిక్ చేయండి
వీడియో -5 (class room puppet kit)
రాష్ట్రము లో అన్ని హై స్కూల్ లకు సరఫరా చేయబడ్డ CRPK puppet కిట్
ను పరిచయం చేయడం కోసం ఈ వీడియో .
8 April 2012
వీడియో - 4 ( గౌతమి HAPPY BIRTHDAY )
గౌతమి పుట్టిన రోజు HAPPY BIRTHDAY SONG పాడిన మన్విత
7 April 2012
వీడియో-3 (big trouble)
మానస పెట్టె లో నుంచి ఎలా బయటకి వచ్చిందో చూడండి
2 April 2012
అవీ ఇవీ - 2
ఏప్రిల్ 2, అంతర్జాతీయ బాలల పుస్తకాల రోజు.
పిల్లల కు పుస్తకాలు చదవ టంలోని ఆనందాన్ని తెలియచేయటం, జీవితం లో స్పూర్తి నిచ్చే పుస్తకాలను పరిచయం చేయడం ఈ రోజు యొక్క
ప్రధాన ఉద్దేశ్యం.
"చినిగిన చొక్కా ఐనా తొడుక్కో , మంచి పుస్తకం కొనుక్కో"
"అక్షర రూపం దాల్చిన ఒక్కో సిరా చుక్కా,
లక్షల మెదళ్ల కదలిక "
లాంటి మంచి మాటల్ని పిల్లలకు తెలియ చేయాలి
The Little Mermaid Story., The Ugly Duckling ,
The Nightingale వంటి అనేక ప్రముఖ పిల్లల కథల రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క పుట్టినరోజుకు గుర్తుగా International childrens books day గా జరుపుకుంటున్నాము.
The Nightingale వంటి అనేక ప్రముఖ పిల్లల కథల రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క పుట్టినరోజుకు గుర్తుగా International childrens books day గా జరుపుకుంటున్నాము.
అందరికీ హ్యారీ పాటర్, గలివర్స్ ట్రావెల్ వంటి రచనలు బాగా తెలుసు. మనకు అద్భుతమైన పిల్లల పుస్తకాలు పంచతంత్రం,తెనాలి రామలింగని కథలు, పేదరాసి పెదమ్మ కథలు వంటివి ఎన్నో లభిస్తున్నాయి. చందమామలు, బాలమిత్రలు, బుజ్జాయు వంటి పిల్లల పుస్తకాలను కాపాడ వలసిన అవసరం మన పైన వుంది . ఈ పిల్లల పుస్తకాలు,పిల్లలే కాకుండా పెద్దలు కూడా చదువుకునే టట్టు వున్నాయి.
రోజు స్కూల్ బుక్స్ చదువుతాం. అవి కాకుండా మంచి పుస్తకాలు చదవడానికి ప్రయత్నించండి, అంతర్జాతీయ బాలల బుక్ డే సందర్భముగా ఈరోజు నుండికనీసం నెలకు
ఒక మంచి పుస్తకాన్ని చదివే అలవాటు చేసుకోండి.
ఒక మంచి పుస్తకాన్ని చదివే అలవాటు చేసుకోండి.
promote book culture,
stop the look culture ( watching tv)
stop the look culture ( watching tv)
నానీలు -2
డబ్బులు
వల విసిరాయి .
మనిషి చిక్కి చేపై,
విలవిలలాడాడు.
---------------------------
స్వార్ధం చెప్పే సుద్దులు
స్థిర పడుతున్నాయ్.
సర్దుబాటు
సాధ్యమేనా!
------------------------
చెవులు రిక్కించి
వింటున్డండి.
గలగలమంటూ
డబ్బులు చెప్పే పాఠం.
-----------------------
మనిషంటే
ఎవరు?
వున్నదాన్ని వదలి,
లేని దాని కోసం ఏడ్చేవాడు.
------------------------
మంటలు రేపే వాడు
మంచోడైతే,
మంచి చెప్పే టోడు
మంటవుతాడు.
Subscribe to:
Posts (Atom)