Pages

8 August 2013

శంఖం


1
వళ్లు విరుచుకుంటూ,..అంటానిలా,..
ఎవరూ పట్టించుకోనప్పుడు,.ప్రశాంతంగా  వుంటుంది,.అని,..

2
నీ వంకెవరూ చూడనప్పుడు,.
నువ్వెంత అశాంతిగా వుంటావో,.
నాకు తెలియనిదా,.

3
అయినా,. ప్రశాంతత,..అశాంతి  అనేవి,.
మనసుకు మనం అద్దుకునే రంజనాలు లాంటివి,..
పక్కనోళ్ల ప్రమేయం పెద్దగా వుండదేమో,..

4
బొక్కల బుగ్గలు సాగదీస్తూ,.
ప్రేమనింపుకున్న స్వరంతో,.
చెంపలు నియత్రించేంతటి చిరునవ్వుతో,.
సహనం నింపుకున్న ముఖంతో
ఇంకా,.ఇలా అంటుంది,..
ఎప్పుడూ చెప్పేదే అనుకో,.
ఇంకో మాట చెప్తాను,.వినుకో,..
నిన్ను అర్థం చేసుకోవడమే నీకు చేతకాదు,.,,..
ప్రపంచం నీకెల అర్థమవుతుంది,..
ప్రవచనాల పైత్యం కాస్తా తగ్గించుకోరాదూ,..
5
రోజూ చెప్పే పాఠాన్ని మళ్లీ చెప్తుంది,.,. మా ఆవిడ,.




2 comments:

  1. అయినా,. ప్రశాంతత,..అశాంతి అనేవి,.
    మనసుకు మనం అద్దుకునే రంజనాలు లాంటివి,..
    పక్కనోళ్ల ప్రమేయం పెద్దగా వుండదేమో,...బాగుంది మాస్టారు మీ కవిత.జీవిత సత్యాన్ని చెప్పింది

    ReplyDelete