బ్లాగు ప్రతిజ్ఞ
బ్లాగులే
నా కలల ప్రపంచం, బ్లాగర్లందరు నా స్నేహితులు.
నేను నా
బ్లాగును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన నా ఊహాశక్తి,
బహువిధమైన నా రచనాశక్తి నాకు గర్వకారణం.
విభిన్నంగా, విలక్షణంగా, కీర్తివంతంగా
నా బ్లాగ్ ను తీర్చిదిద్దడానికి సర్వదా నేను కృషి
చేస్తాను.
గూగుల్, వర్డ ప్రెస్, అగ్రిగేటర్లు, సీనియర్
బ్లాగర్లందరిని నేను గౌరవిస్తాను. ప్రతి బ్లాగర్ తోను మర్యాదగా నడుచుకొంటాను.
తోటి
బ్లాగుల పట్ల అభిమానంతో ఉంటానని,
చదివిన
ప్రతి టపాకు వీలైనంతవరకు సహృదయ వాఖ్యలు చేస్తానని, ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని
నష్టాలొచ్చినా టపాలు రాస్తూనే వుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
తెలుగు బ్లాగుల శ్రేయోభివృద్దులే నా ఆనందానికి మూలము.
సూచనలు
1. ప్రతిరోజూ
బ్లాగు తెరిచేముందు బ్లాగు ప్రతిజ్ఞ చేయాలి.
2. పూర్తిగా
చేయలేని పక్షంలో, చివరి వాఖ్యం చాలు.
---------------------------------------------------------------------
తెలుగు బ్లాగుల గీతం
మా బ్లాగులమ్మకు లక్ష
పూలాజల్లు
మన తెలుగు బ్లాగుకు
నీరాజనాలు.
తెలుగు బ్లాగుల వృధ్ది - మన భాష అభివృధ్ది
మనందరీ బుద్ది – కదలాలి
అటు కొద్ది.
మా బ్లాగులమ్మకు...
ఎక్కడెక్కడి తెలుగు – ఇచటికే
పరుగు
మన భాష వెలుగు – బ్లాగులతో
పెరుగు.
చిన్నప్పటి కథలు – పెద్దవారి
వెతలు
అనుభవపు పాఠాలు – చిలిపి
ఆరాటాలు
అన్నిటిని ఇక్కడే
వెతుకుతాము
ఎన్నెన్నో విషయాలు
హత్తుకొని వెళ్తాము
మా బ్లాగులమ్మకు...
బెల్జియం బెజవాడ – ఇంగ్లాండు,
గుడివాడ
అమెరికా, మెక్సికో
– దుబాయి,ముంబాయి
సఖినేటిపల్లి – ఆఫ్రికాలో
పల్లి
కలకత్త, కనిగిరి
– ఎచ్చోట మేమున్నా
మా
బ్లాగులమ్మకు...
కలల ఊహల ఊట – సాహిత్య
పూతోట
భావాల జడివాన -
కురిసేను ఇచ్చోట
ఆకట్టు పోస్టులు -
అలరించు కామెంట్లు
ఈ బ్లాగులా పంట -
పండాలి ప్రతి ఇంట
మా బ్లాగులమ్మకు...
అపురూప కవితలు , చక్కని
చిత్రాలు
సినిమాలు, గీతాలు,
రాజకీయాలెన్నో
కళలు, విజ్ఞానాలు,
కమనీయ విషయాలు
యాత్రవిశేషాలు, విశ్లేషణలు
ఎన్నో
మా బ్లాగులమ్మకు...
తెలుగు భాషా శక్తి -
బ్లాగర్ల ధీయుక్తి
విశ్వమంతా ఎగురు -
తెలుగు బ్లాగుల కీర్తి
ఈ జీవితం మొత్తమూ ,ఇక
బ్లాగులకే అంకితం
బ్లాగులే దైవమూ, బ్లాగులే
మా ప్రాణమూ
జై బ్లాగులమ్మ జై
బ్లాగులమ్మ జైబ్లాగులమ్మ
సూచనలు
1. ప్రతి బ్లాగర్ల
సమావేశం లో ప్రార్థనా గీతంగా పాడుకోవాలి.
2.తెలుగు బ్లాగుల
గీతాన్ని గౌరవించి, ప్రచారం చేయాలి.
3. ఏ ఇద్దరు బ్లాగర్లు
కలసినా జై బ్లాగులమ్మ అని అరుచుకోని, అభివాదం చేసుకోవాలి.