Pages

16 November 2013

అధిబౌతికం


1
అలా ఈడ్చుకుపోతున్నప్పుడు,.
కాలికో తాడు కట్టి,. అభావంగా,.
ఆ మట్టిరోడ్డు,.కంకర రాళ్లమీద,.
వెనుకపడుతున్న ఆ పిల్లల ఆకలి చూపుల,.
దాహాన్ని తీర్చడానికి,. ఏ స్తన్యం సిద్దపడుతుంది.

2
నిన్నటి దాకా మరి నీ పక్కనేకదా,.
నీ కాళ్లమధ్యనే కదా అవి,.
విసిగించి, విసిగించి,.నీ పైబడి,
వెచ్చని,.నీ రొమ్ముల మధ్యనే కదా,.అవి,
అరమోడ్పు కన్నులతో,.పాలు కుడిచి,.

మంచుకురుస్తూ, చీకటి వణికే వేళ
రేపటి శీతాకాలపు కాళరాత్రి,.
ఎన్నెన్ని భయాలమూటలను,.పారద్రోలి,.
ఇక ఎలా ప్రశాంతంగా నిద్రిస్తాయోకదా,. అవి.
3
దేహాంత నిర్జీవత్వాల ప్రశ్నల పరంపరల్లో,.
దేని సమాధానలు,. దానివే,.
అయినా సరే,. వెంట నడవడంలో,
ఉపశమించే వేదన  అలా అనుసరిస్తుందేమో,.
నీరు కార్చడం తెలియని,.
 స్వచ్ఛమైన కళ్లుకల ఆ కుక్కపిల్లలు,..

మరి,. అలా ఆ తల్లి కోసం.,.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/655210721198350/

15 November 2013

ఒకానొక ఫీలింగ్ - 43

నేను తనవంక చూస్తూ,.
అదేపనిగా మాట్లాడుతున్నప్పుడు,.
అప్పుడు తనడుగుతుంది,.

ఎందుకంతా నిశ్శబ్థంగా వున్నావని.

చట్రార్థి


1
ఎటునుంచి ఎటుకైన ఒకటే దూరం,.
లెక్కలేయటమెందుకో,.
విప్పుకోలేని జీవితాన్ని,.
ఇన్నిన్ని కొనల బలహీనతలనుంచి.

2
తెలుసుకోవాలనుకుంటాను,.కాస్తా,
మిగుల్చుకోవాలనుకుంటాను,.కొంచెం.
వదులుకోవాలనుకునేవే,.
ఎంతకి లెక్కతేలడం లేదు.

3
ముద్దుగావుందని,
తిరగంగా తిరగంగా,.ఎత్తుకోని,.
మోయలేని భారమై,.
భూస్థాపితమైనట్లు,.ఓ కల.

4
అగ్గి రగులుతుండాలి,.
తడి తగులుతుండాలి,..
స్థిరపడటంలో ఏముంది,.

ప్రవాహాన్ని ఆశించు,.
--ఆంధ్రభూమి లో ప్రచురితం-

14 November 2013

ఎ చైల్డ్ సాంగ్


పిల్లలం మేం బడిపిల్లలం – పిల్లలం మేం బడి పిల్లలం
అ,ఆ,ఇ,ఈ దిద్దేవాళ్లం, చదువులు బాగా చదివేవాళ్లం
వేళకు బడికి వెళ్లే వాళ్లం, అల్లరి ఎక్కువ చేసే వాళ్లం,
పిల్లలం మేం బడిపిల్లలం – పిల్లలం మేం బడి పిల్లలం

చదువులు బాగా చదివేవాళ్లం, బండెడు బుక్స్ మోసేవాళ్లం,
వాగులవంకా, పొలాల వంక పరుగులు బాగా తీసేవాళ్లం,
చింతకాయలు రాలాలంటే రాళ్లు తీసుకు కొట్టేవాళ్లం,
పిల్లలం మేం బడిపిల్లలం – పిల్లలం మేం బడి పిల్లలం

అమ్మ,నాన్న,సార్ల మాటలు ఎంతో చక్కగా వినేవాళ్లము,.
వాళ్లకి కోపం వచ్చిదంటే తన్నులు బాగా తినేవాళ్లము,.
పిల్లలం మేం బడిపిల్లలం – పిల్లలం మేం బడి పిల్లలం

7 November 2013

డిక్లరేషన్ ఆప్ ఎ పొయట్



ఒక అజ్ఞానపు వచనం
ఇలా మొదలవుతుంది బహుశా

1
నేనెల పిలవబడుతున్నాననేది,
ఎప్పటికి, నాకు కిరీటమై మిగలబోతుందనేంత,
స్పృహ లేని పరిస్థితులలోకి,.
ఎలా నెట్టబడుతుంటుంటామో.

2
అక్షరాలకు విలువవుండాలనేదే,.
నా అభిమతం కూడా,.
నీలో ఆలోచనలను రేకెత్తింప చేయాలనేదే,.
 వీటి లక్ష్యం కూడా, వీటిధ్యేయం కూడా,.
3
ఏ హితాలను ఆశించి,.
మొదలవుతుందో కాని,. ఓ అక్షరం
ఏ సమాజాల శుద్ధి కోసం,
బయలుదేరుతుందో కాని,.. ఓ వాక్యం
కానీ,.అవి కూడా కలలు కంటాయేమో,.
ఒకానొక మసిబారని మస్తిష్కం నుంచో,.
విషంపూసుకోని జ్ఞానపు కోరలనుంచో,.
తమ ఉద్భవానానికి,.నాంది జనించాలని.
4
అక్షరం నిజానికో వికృతక్రీడ కాదు,.
లోపలి అస్పష్ట అశుద్దాలను వెదజల్లడానికో,.వేదికా కాదు,.
వ్యక్తి స్వేచ్ఛముసుగుల్లో,.
పరాయి మెదళ్లను బంధించే శృంఖలమూ కాదు,.
5
నీకో వాదముంది, అంగీకరించవచ్చు,.
అదే సత్వమంటే మాత్రం విభేదించాలనేంత,
తెలివిని కూడా కోల్పోయేటంత అభిమానాన్ని,
మూటలుకడుతున్న వాక్యాలు,
ఎంతగా మండిపోతుంటాయో,.
నీ లొంగుబాటును చూసి,.
6
ఎగరాల్సిన ఎత్తులు,. చేరుకోవాల్సిన చోట్లు,
నా లోపలి ప్రత్యేక ఆలోచనల వికృత సమూహాలు,
బలహీనతలపై చూపుపెట్టి,,.గురిచూసి వలవేసిన లోతులు,
తడి ముసుగులో నికృష్టపు వాంతులు,
వేడివేడి అయోమయపు నూనెను,.
బొబ్బలెక్కలా పోసి,.ఓదార్చే మాయలు,
నిను దారితప్పించే దరిద్రాలు,..
నిను నిద్రపుచ్చే మాటలు,,.
పాక్షిక దృష్టుల దుష్టుల పక్షపాతపు రాతలు,.

 సెలవు,సెలవిక సెలయేరా,.. నువ్విక పారబోక.
8
సమాజహితాన్ని కాంక్షించేదే సాహిత్యమైతే,
కవిత్వమూ అందులో ఓ భాగమైతే,
ఇక్కడే కాదు,, ఎక్కడా అలా భావించేంత,
హితాక్షరాలు  కనబడనప్పుడు,.
చాతకానప్పుడు అలా రాయడం,
ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పుకుంటాను,.
 నేను కవిని కాదని,.ఎప్పటికి కాలేనని.


6 November 2013

ఆలూరి బైరాగి || శ్రీరంగం నారాయణ బాబు||

 విస్మరించబడిన మహాకవి శ్రీరంగంనారాయణ బాబు గురించి బైరాగి వ్రాసిన కవిత.,.. బైరాగిగారి గొప్పకవితలలో  ఇదొకటి. నారాయణబాబు ప్రభావం బైరాగి మీద స్పష్టంగా కనిపిస్తుందంటారు,. 



And his death only a symbol

సంజ్జ్ఞ సరిహద్దున లో మాంచాల లోయలోన
నీడలు కూడే చోట,
గడియారపు ముండ్ల జంట కడపటి కౌగిలిలో
మత్తిలి మసకలాడే చోట,
అగణితగణిత చిహ్నాలు, ఆకాశపు శాఖలపై పొంచి
చంక్రమించే చోట,
వివేకపు విరిగిన గద్దెపైన,ఆరాచకపు రాచరికాన
తలక్రిందుగ తపస్సు చేస్తున్నవాడు,
జాడీబీడీల చండీహోమ ధూమకుండలిలోంచి
ఖండిత ఖడ్గమృగాలు, గండర గండ బేరుండాలు చూస్తున్నవాడు,
ఆకలిని మేస్తున్నవాడు,
భూతాభూత జ్యోతిష్కుడు, సంతతాన్య చేతస్కుడు
అతడే ఊఱ్ధ్వరేతస్కుడు, హర్షామర్షాలు లేని మహర్షి,
ఉద్ర్గంథాలు తలదిండ్లుగా నాడు నేడులు క్రీడించిన చింకిచాప,
అప్సరసల సవాయిహాయి,
స్వాప్నిక సంయోగాల స్వేదదుర్భర జాగరణాలు,
కాశీమజిలి కథల రాశీభూత సురతశ్రమలు,
పౌరాణికపు పయోరియా ఊసే బోసినోట
కదిలే కవితా క్రిములు,
ఎండిన ఇసుకపై కోరిక కుంటిచేప
అంతరంగపుటరలలో ఉపనిషత్తులు,మార్క్సు,ఫ్రాయిడ్,
వాత్స్యాయనుడు,హెవలక్ ఎలిస్,లీలావతి,
అయిన్ స్టీన్, కాళిదాసు,జేమ్సుజాయిస్
ఆదిమ నిషాదుని విషాదానికి బీటనిక్కుల నిషాతోడు,
అవచేతనపు టెక్సరేలో, ఈడిపస్ కాంప్లెంక్స్
గర్భకోశపు ద్విపటిలో, తల్లివంటి చీకటిలో
స్వరతి నిరత బాలకుడు, దోషకశాచాలితుడు.

అతని మనసు క్యూబిస్ట్ బేబిలోను,
వెర్రిపీరులు, శివలింగాలు, సింధూర చర్చిత శిలలు,
రక్తాంబరధారుడాతడు, రక్తాక్షుడు, ఆదిశక్తి ఆరాధకుడు
జీవిత శ్మశానంలో కవితా శవసాధన చేస్తున్నాడు,
ఝల్లుమనే కంకాళాలు, ఘల్లుమనే కపాలాలు
గుహ్యతాంత్రిక గుహలలో భైరవ మంద ప్రతిరవాలు
ఆటవిక పటహ ఘోసలు,... టోటెమ్లూ
అగ్నిచుట్టు నర్తించే దిగంబర శూలధరులు
ఆఫ్రికాలో అర్థరాత్రి.

నిర్జన మానసాన అడుగులసడి పడిపడిమ్రోగ
నీడల్లో ఒదిగిఒదిగి పోతున్నాడు నేరస్తుడు,
హఠాత్తుగా సందు మలుపు తిరుగగానే
బుగ్గమీసాల పత్తేదారు హేండ్సప్ అని అరిచాడు.


4 November 2013

అకవిత్వం



సారాన్ని కోల్పోయాక, నేలతల్లి
విలువైన ఏ విత్తును మొలకలెత్తించలేదు,.
చవిటిపర్రై,.పిచ్చిమొక్కలకు ఆలంబనగా నిల్చి,.
ఆనందవడటం తప్ప,.

అండాల్లేకుండా గర్భాశయాలు,.
పిండాలకు రూపమిచ్చి,.
ఏ బిడ్డలకు జన్మనివ్వలేవు,.
ప్రమాదకరమైన కణుతలకు,
పొదరిల్లుగా మారడం తప్ప,..

ఆస్వాదించే హృదయాన్ని,.
స్పందించే మనసుని పోగొట్టుకున్నాక,.
ఎంత గొప్ప కవిక్షేత్రమైన,.
కదిలించే ఏ కావ్యానికి వెలగునివ్వలేదు,.
అర్థం పర్థం లేని అకవిత్వ రాశులకు తప్ప,

దొంతర్లుగా పుస్తకాలు పేర్చుకోవడం తప్ప,.

2 November 2013

హేరంబము


1
అది నేరమేనా,.అంటే,.
ఏమో నేనైతే ఏం చెప్పలేను,.
చట్టవిరుద్దంకదా,.సరదాకదా,
అది పిచ్చితనమా,గొప్పతనమా,..
అంటే దానికీ కూడా,.

2
చిరాకు చూపుల్లో కూడా,.
కొంత ఆమోదాన్నివెతుక్కోవాలి,.
లేకపోతే,..పొందాల్సిన ఆనందమేదో,.
పోగొట్టుకోమూ,.అలా తిరుగుతూ,.
ఎగురుతున్న పొగలాగా,..

3
ఏఏ సమూహాలలో,.అంటుకుంటుందో,.
ఏఏ పరిణామాలకు,.అది దార్లు వేస్తుందో,.
ఒక్కటనేముంది,.రకరకాల చోట్ల,.
ఆర్దికంగానో,. మానసికంగానో,.
శారీరకంగానో,.సామాజికంగానో,.
నీకో ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తుందేమో,.
అలా వెలుగుతూనే అది,.

4
అప్పుడప్పుడు ఇలా అనిపించి,.
నవ్వోస్తుంది,.నా అమాయకత్వానికి,..
గుండెల్లో ఆగిపోయిన మరుద్వాహ లాగ,.
ఈ మాటకూడా అక్కడే ఆగిపోతుంది.,

 భువికి ఏతెంచిన,.
సాతాను ప్రియదూతలు,
ఆత్మహుతిదళ సభ్యులు ,.
బహిరంగ ధూమపానులు,వాళ్లు,.