ఎలాగోలా
జీవిస్తున్నామని,
అప్పుడప్పుడు
నిట్టూరుస్తుంటాం,.
ఎలా బ్రతికినా,.
అది ఎలాగోలాలో ఓ భాగమని
,
మనమెప్పటికి
గుర్తించలేం,.
మరణానికి ఫలానిది
కారణామని,
తేలికగా
చెప్పేస్తుంటాం,.
బలమైన ఓ కారణాన్ని,
నిజానికి,
మృత్యువే
సృష్టిస్తుందన్న వాస్తవాన్ని,
మనమెప్పటికి అర్థం
చేసుకోలేం,..
కుప్పలుతెప్పలుగా
కవిత్వాన్ని రాస్తున్నామనుకుంటూ,
ఖుషీ చేస్తుంటాం,
నిజానికి,
కవిత్వమే మనల్ని ఓ
పావులా,
వాడుకుంటున్న
సత్యాన్ని,
కలల్లో కూడా ఎప్పటికి
ఊహించలేం,..
మనకెప్పటికి
ప్రశ్నార్థకమై,
మిగిలే మూడు
సందిగ్ధాలు,
జీవితం,కవిత్వం,.మృత్యువు,..
bavundi
ReplyDeletethank you thanooj,.
Delete