Pages

6 March 2013

భ్రాంతి


లక్ష యధార్థాలు, కోట్ల సత్యాలు,
తారసపడతాయేమోనని,
తపన పడుతున్నావేమో, నువ్వు,.

వున్న ఒక్క యధార్థమూ,
పరిపూర్ణ సత్యమూ,.
నీ ఎదుటే నిలిచినా,
నిరంతరమూ నిన్ను వెంబడించినా,
తృణీకరించబడుతూనే వుంటుంది కదా,..

ఉమ్మనీరై,నిను కమ్ముకున్న
మాయాజ్ఞానపు పొరల మత్తు చేత,.


భ్రాంతి మాత్రమే మిగులుతుంది,
జ్ఞానమన్నది గడ్డిపోచై,.

సోది మాత్రమే సోకుతుంది,
సత్యమన్నది మసకబారి,.

2 comments:

  1. వున్న ఒక్క యదార్ధమూ,
    పరిపూర్ణ సత్యమూ,
    నీ ఎదుటే నిలిచినా,
    నిరంతరమూ నిన్ను వెంబడించినా,
    తృణీకరించబడుతూనే వుంటుంది కదా ...

    యాదార్ధాన్ని సూక్ష్మంగా , అద్భుతంగా చెప్పారు .

    ReplyDelete
  2. మీ అభినందన ఎంతో సంతోషాన్నిచ్చింది, భారతి గారు,..ధన్యవాదాలు,..

    ReplyDelete