Pages

7 March 2013

వదల్లేక,....



నన్నిష్టపడవు అని తెలిసికూడా,
నీ కోసం నిరంతరం గాయపడుతూనే వుంటానిక్కడ,.

భారమైన దిగులు మబ్బుల్ని,
కనురెప్పల మాటున కప్పిపెట్టి,
జోరువానలో కూడా,..
ఆశల దీపాలు వెలిగిస్తునే వుంటానిక్కడ,.


నీకై పరితపించి, పరితపించి,
ఎప్పటికైన నువ్వొస్తావని ఎదురుచూస్తున్నప్పుడో,
ఇంకెప్పడో,
దూరతీరాలకు పయనమై నువ్వలా సాగిపోతావ్,.
ఎప్పటికి నాకందకుండా,
కనురెప్పపాటులో మాయమైపోతావ్,.

కొలనులోని తుంటరి అలజడిలా,
చెదిరిపోయిన నీ రూపం కోసం,
నేనిక్కడ చీకట్ల జలాల్లో,
తడుముకుంటూ, వెతుక్కుంటూ,
నీ రూపాన్ని మరంతగా చెదరకొట్టుకుంటూ,.
తడుముకుంటూ వెతుక్కోవలసిందే,.
అయోమయంగా అన్వేషించాల్సిందే,.

ఏ రాత్రి వేళో కలల్లోకి చొరబడే
నిన్ను,పట్టుకోవాలంటే,
తెల్లార్లు జాగారం చేయాల్సిందే,..
నాకందకుండా జారి పోయిన నీకోసం,
బహూశా, నే జీవితమంతా భ్రమించాల్సిందే,..

( ఒక చిత్తుపేపరు ముక్కలో కనిపించిన ఓ కవితను సృజిస్తుంది రాసింది,. చాలా కాలం క్రింతం)


4 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు తనోజ్,...

      Delete
  2. బాగుందండి.
    కానీ ఒక సందేహం.......రాత్రంతా జాగారం చేస్తే కలలెట్లా వస్తాయంటారు? :))))))))

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు లక్ష్మీదేవి గారు,..జాగారం చేస్తే కలారాదు, కలలో తను రాదు,,.నిన్ను తలుచుకుంటూ నిద్రలేని రాత్రుల గడుపుతున్నాననేమో,..

      Delete