Pages

19 April 2014

ఎనోమలి



వాడొక చినుకులాగా రాలినప్పుడు
మొలకెత్తే విత్తులా వున్నప్పుడు
విచ్చుకున్న పువ్వులాగా నవ్వినప్పుడు
విరజిమ్ముతున్న నిప్పై రగిలినప్పుడు
వాడొక తేడాగాడు.

సులభ్ కాంప్లెక్స్ తలుపు మీద రాతలా లేనప్పుడు
తుపుక్కున్న ఉమ్మిన పాన్ మరక కానప్పుడు
జిల్ జిల్ జిగాలో ముడుక్కుని కూర్చున్నప్పుడు
బురదలో పందిలా దొర్లనప్పుడు
వాడొక తేడాగాడు.

కాస్తంత బుర్రను వెలిగించుకున్నప్పుడు
మైకాన్ని వదిలి మాట్లాడినప్పుడు
బాధ్యతకు నిలబడి బతికినప్పుడు
గుండెల్ని తెరుచుకుని హత్తుకున్నప్పుడు
మానసిక దుర్భలత్వాన్ని వదలుకున్నప్పుడు
వాడొక తేడాగాడు.

సవాలక్షా మాడాగాళ్లకు,
మాయదారి మీటాగాళ్లకు
అప్పుడయినా, ఇప్పుడైనా 
అక్కడైనా, ఇంకెక్కడైనా

వాడెప్పుడూ నిఖార్సయిన తేడాగాడే.

1 comment:

  1. ఇది చైతన్యం, ఇది నవతరం, ఇది పురోగమించే సంగమం ఇలానే ప్రజలందరిని తేడాగా చేయండి.

    ReplyDelete