నా కిప్పుడు జనం కావాలి.
పల్లకీలో ఎక్కించి,.
ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే
బలిసిన భుజాలు లాంటి జనాలు.
రెండు మెతుకులు కూడు కోసం,
కుక్కల్లా కాళ్లు నాకే
విశ్వాసం గల జనాలు.
పొదుగుల నుండి రక్తం పిండుతున్నా
ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు.
రెండు కాగితాలకు, ఓ
క్వార్టర్ మందుకో
తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు,
నాకిప్పుడు జనం కావాలి.
మనుషులమనే మరిచిపోయిన
గాడిదల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి,
నక్కల్లాంటి
ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు
అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు
మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే,
సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు.
నాకిప్పుడు జనం కావాలి.
కళ్లుండి చూడని జనాలు,
మెదడుండి ఆలోచించని జనాలు,
కాళ్లూ చేతులూ వుండి
పనిచేయని సోమరి జనాలు.
బతుకంటే ఏంటో తెలియని జనాలు,
బతకడం చేతకాని జనాలు,
బీజమూ లేక, అండమూ రాక
కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే
నపుంసకుల్లాంటి జనాలు కావాలి.
నాకిప్పుడు జనం కావాలి.
నేననుకొనెట్లు మాత్రమే ఆడగల
బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు.
2
ఓ ఆర్డర్ కి సప్లైయ్ చేయాలి.
ఎంత మంది దొరకచ్చిక్కడ?
అవును నాకిప్పుడు జనం కావాలి.
ReplyDeleteఅవునండి ఎందుకిలా అవుతుంది.
ReplyDeleteఎవడిదీ పాపం.
ఎన్ని రోజులు వీళ్ళను ఇలానే ఉంచాలనే కోరిక ఎవరిది.
దీనికి పరిస్కారం లెదంటారా?
వీరికి చైతన్యం రాదా?
వీరిని చైతన్యులను చేయలేమా?