పైకి చెప్పుకోలేని ప్రేమను నొక్కిపెట్టి,
నవ్వుతూ చూస్తాను, నేను నీ వైపుకి
ఎంత నిస్సహాయుడివి నాన్నా, నువ్వని.
ఇంకేమీ చేయలేక,
ఆ కుర్చీ రెక్కలకు పట్టిన దుమ్మును,
చేత్తోనలుపుకుంటూ, నాలుగు మాటలతో పాటుగా
నీ దుఃఖాన్ని కూడా
రాల్చుకుంటావ్.
ఆరిపోయిన దీపమై నేను కూడా,
ఒక పొగలాంటి నిట్టూర్పుతో,
నీ నిష్క్రమణను స్వాగతిస్తాను.
లోపలి మంటల జోలికిపోక,
బహుశా నువ్వు నా నవ్వునే
జ్ఞాపకంగా మిగుల్చుకుంటావేమో! నన్నొదిలి.
నేనిక నీ దుఃఖాన్ని ఏరుకొని తలకెత్తుకుంటాను.
ఆ రాత్రికి ఇక.
ఆరిపోయిన దీపమై నేను కూడా,
ReplyDeleteఒక పొగలాంటి నిట్టూర్పుతో,
నీ నిష్క్రమణను స్వాగతిస్తాను....ఇలా అందరికీ సాధ్యం కాదేమో.