కవిత్వాన్ని
ప్రేమగా హత్తుకొని,
ఇక ఆ
తరువాత,
దాని కుత్తుకను
కోసి,
కౌగిలించుకొని,
కన్నీరు కారుస్తూ,
బిజిలీ లేని
గలీజు ఎలీజీలను
గజిబిజిగా
రాసుకుంటూ,
సానుభూతి
పొందేవాడుంటాడే,
వాడురా, కరుడుగట్టిన కవంటే.
కవిత్వం
ఎదగకూడదు,
పూర్తిగా
చావకూడదు.
No comments:
Post a Comment