Pages

18 September 2013

సత్యావస్థ


1
ఒకానొక సంధ్యా సమయం నుంచి,.
మరొక సాయంత్రానికి,. కాలాలు నడిచిపోయాక,.
అన్నింటిని తెంపుకుంటూ, గడిచిపోయాక,,
కొన్ని ప్రయాణాలు ముగిసిపోయాక,,
వొంటరి లోకాల్లోకి,. విసిరివేయబడ్డాక,.
నెమరేసుకుంటూ, మునిగిపోతున్నప్పుడు,
జ్ఞాపకాల సంద్రాలలోకి,.మిత్రుడా !
తప్పనిసరి తీరం కవిత్వమై తీరుతుంది,
కాస్తంత ఆసరాగా మిగలడానికి,.
కాదంటావా,. మరి నువ్వు.

2
వాక్యాలకు విలువేం వుంటుందిక్కడ,
ధిమాక్ ఖరాబ్,.చేయడానికేసే లెక్కలే తప్ప.

చేతనొస్తే నీకు,.అప్రతిహతంగా ఆఘ్రాణించు,
సంభాషించుకున్న చేతులను,ముఖాలను
కొన్ని శరీరాలను,.ఇంకొన్ని మాటలను,
రువ్వుకున్న నవ్వుల్ని,పారేసుకున్న కవిత్వాన్ని,.
పువ్వుల్లాంటి మనుషులు మోసుకొచ్చిన,
ఆ అతీంద్రియ పరిమళాల గుభాళింపుని,.
లోపల్లోపలి లోపల్లలోకి,
గుండెల నిండా బలంగా పీల్చుకో,.
ఆల్ మోస్ట్,. అదేనేమో కదా జీవితం.
3
నేనైతే ఇంతే అనుకున్నాను,.నిన్నటిదాకా.,
జ్ఞాపకం అంటే నిశ్చల ఛాయాచిత్రమని,
చూసి చూసి మురియడానికి,
తలుచుకుంటూ తడవడానికి తప్ప,.
మరేముందని అందులో అంతగా గొప్పని,.

మాట్లాడుతూ,మురిపిస్తు
కవ్విస్తు,కవిత్వీకరిస్తూ
విభేదిస్తూ,విశ్లేషిస్తూ,
కోస్తూ,కాలుస్తూ,.

ఒరేయ్ హౌలాగా,.ఇప్పుడు చెప్తా విను,.
జ్ఞాపకమంటే మనిషిరా,.
కొన్నిసార్లు అంతకంటే ఎక్కువేననుకో,.
స్థిరపరుచుకో, ఈ సత్యాన్ని,ఇక.. ఈ జీవితానికి


4 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు అనికేత్ గారు,..

      Delete
  2. మొదటి కవిత చాలా నచ్చిందండి.

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, ధన్యవాదాలండి,.. మూడూ కలపి ఒకే కవితలా అనిపించడం లేదా,. నేనల అనుకుని రాసానండి,.

      Delete