చినుకుకు భయపడి,
గొడుగు విప్పేవాడు,
చలి పుట్టిందని,
రగ్గు కప్పేవాడు,
చెమట చుక్కను,
ఎన్నడూ రుచి చూడని
వాడు,.
ఏం అనుభవిస్తాడు,.ఏం ఆస్వాదిస్తాడు.,
రోగం వస్తుందని,
కడుపు మాడ్చేవాడు,.
సంపదల్ని
కూడబెట్టి,
కోరికలు కాల్చేవాడు,.
మనిషి మనిషిని,
నిరంతరం
పీడించేవాడు,.
ఏం అనుభవిస్తాడు,.
ఏం ఆస్వాదిస్తాడు,.
నవ్వులు కురిపించని
వాడు,.
దుఃఖాన్ని
పలికించని వాడు,.
సందేహాలతో
చచ్చేవాడు,.
స్వార్థంతో
బతికేవాడు,.
ఏం అనుభవిస్తాడు,.
ఏం ఆస్వాదిస్తాడు,.
అనుభవించు -
ఆస్వాదించు
ఈ చిన్న జీవితాన్ని
ప్రేమించు,.
సులభవాచకం,.7/9/2013
భాస్కర్ గారూ, బాగుంది, చివరి నాలుగు పాదాలూ చక్కగా చెప్పారు.
ReplyDeleteధన్యవాదాలు ఫాతిమా గారు,
Delete