Pages

3 September 2013

నీటి చూపు


1
అంత శక్తి నాకుందో,
లేదో తెలియదు కాని,.
వడివడిగా పరుగులెత్తి,
బురద మీద కాలేసి,.
జర్రున జారుటవచ్చు,
ముందుకు పడుటావచ్చు,.
విరిగిన పళ్లను కాంచి,.
ఇక్కిలించుటావచ్చు,..

2
అంత తెలివి నాకుందో,
లేదో తెలియదు కాని,.
ప్రతి దానికి అడ్డంగా ,.
మాట్లాడుట నాకు వచ్చు,.
వాదరినై విలువలను కోల్పోవుట నాకొచ్చు,.
నిస్సిగ్గుగా నవ్వుకుంటూ,
నిష్క్రమించుటావచ్చు,.

3
అంత సీను నాకుందో,
లేదో తెలియదు కాని,.
చకచకా రాసేసి,.
టపటప టైపేసి,..
ముఖపుస్తక గోడలపై,.
ప్రచురించుట నాకొచ్చు,.
మహా కవిని నేనంటూ,.,.
కలలూ కనుటావచ్చు,..
పొరపాటున చదివినోళ్ల,.
బుర్రలలో వున్న గుజ్జు,,.

స్ట్రాతో పీల్చుట వచ్చు,. 
------------------------------2/9/2013

4 comments:

  1. అమ్మో వీటిలో ఏ ఒక్కటీ నాకు రాదు ;-)

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, నా గురించి రాసుకున్నానేమో.. ఈ వాక్యాలను,..ధన్యవాదాలండి,.

      Delete
  2. ఇంకేమి వచ్హు :-) మిమ్ము మెచ్హుట నాకూ వచ్హు .

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు,. మీ ఆదరపూర్వకమైన వాక్యాలు ఆనందాన్నిచ్చాయి,. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలండి,.. ధన్యవాదాలు

      Delete