Pages

31 May 2013

సహజం

నువ్వప్పుడు నడక నేర్చుకుంటున్నావనుకుంటా,..
ఒక్కోదాన్ని ధ్వసం చేస్తూ,..విజయహాసంతో,.


కొన్ని లోకాలు నేలమట్టమయినాక,..
నీకంటూ నువ్వు కొత్త ప్రపంచాలను సృష్టించుకొన్నాక,..


విధ్వంసం కాదు కదా,.
చిన్న చిన్న మార్పులనే సహించలేనంతగా మారిపోయాక నువ్వు,.
నాకర్ధమౌతుంది సుమా,..జీవితంలోని సహజత్వం,.

30 May 2013

సూక్తి ముక్తావళి

నీకో లక్ష్యం వున్నప్పుడు,
నిన్ను నువ్వు కోల్పోయినా,.ఫరవాలేదు,.
ఎలాగోలా సమర్ధిస్తాను నేను,...

మరొకడి స్వార్ధ స్వప్నంలో దృశ్యంగా మారడం,.
ఎంత ఊరడించుకున్నా సరే,..
కాస్తాంత దుఃఖాన్నే మిగులుస్తుంది, సుమా,..

27 May 2013

భ్రమలజీవి


1
ఎదురుగా కూర్చోని, ఓ చల్లని సాయత్రం
పలుచని గాలి తెరలతో ఆటలాడుతూ కదుల్తున్న,
కురులను వెనక్కినెట్టుకుంటూ,
దొరికిన అవకాశాన్ని, ఏ మాత్రం జారవిడుచుకోకుండా,
కనులలోకి సూటిగా చూస్తూ,ఇలా అంటుంది తను,.
సంధిగ్ధపు చిరునవ్వుని, దిగ్ధంలా సంధింస్తూ,....
విసుగులేని, విరామమెరుగని
నిరంతర అసంతృప్తులతో నలిగిపోతూ,
అపోహల అపార్థాల అగడ్తలు దాటలేక,
మిథ్యాప్రపంచపు ఉచ్చుల్లో చిక్కి,
స్థిమితంగా వుండలేక,
ద్రిమ్మరివై సంచరిస్తావు, ఎందుకలా,..

కాస్తంతా సేదతీరరాదు, ఇలా నా ఒడిలో
కొద్ది క్షణాలు విశ్రమించి,...

2
సుఖాలు కాని సుఖాల మధ్య,
దుఃఖాలు రానివ్వని దుఃఖాల మధ్య,
ఇక్కిలించే కోతుల మధ్య,
క్లారిటి లేని కుక్కుల మధ్య,
నక్కల జిత్తుల టక్కరుల మధ్య,
పసిపిల్లలాంటి కవుల మధ్య,
అదృశ్యాలై వశపరుచుకునే,
భూతప్రేత పిశాచ వాకిళ్ల మధ్య,
వ్యామోహపు చివరి సరిహద్దుల బలహీనతల మధ్య,
ఏం బావుకుందామని భ్రమిస్తుంటావిలా,
వాస్తవజీవితాన్ని వాయువులకొదిలి,.అంటూ

లేని సందేహాల్ని చొప్పిస్తూ,
ఫేసును ప్రశ్నార్థకం చేస్తూ,
మరికాస్తా దగ్గిరికు జరిగిందామె,,.

3
ఇలారా ఇక ఈ రాత్రికి,అన్నింటిని వదిలి
మెత్తని కండల గుండెల పొంగుల మధ్య,
తలవాల్చి, కాస్తా ఊరడిల్లుదువుగాని,.
కాలసంకోచాల్ని విస్మయంగా చూద్దువుగాని,.
హృదయబిలయపు లయల సవ్వడుల
నేపధ్యాన ప్రశాంతంగా నిద్రిద్దువుగాని,..
బుజ్జగిస్తూ, అనునూయంగా ఇంకా ఇలా అంది,
చలనములేని అక్షరాల మధ్య,
తృప్తినివ్వని వాక్యాల మధ్య,
మనసులేని ముఖపుస్తకాల మధ్య,ఈ పత్రికలమధ్య
పిచ్చివాడవై మిట్టాడబోకు,
అందుబాటు అమృతాన్నొదిలి,
అంతులేని భ్రమలజీవివై,.
రా ఇలా రా, ఇక ఈ రాత్రికి అంటూ,
ప్రేమగా హృదయానికి హత్తుకుంటూ,.

4
ఇక ,మరుసటి వేకువ మసక వెలుతుర్లలో
ఇలా గొణుగుతుంది,తను,.
బైరాగులు రాసుకుంటే బూడిద రాలినట్లు,.
కవులు కవుల కలబడితే,
మహా అయితే ఏం జరుగుతుంది,..
నాలుగు కవితలు విదుల్చుకొని నిద్రపోక,..
అన్నం మాని దిగులుపడ్డాడు, పిచ్చినాబట్టంటూ,
తన చల్లటి మెడవంపులో,మరంతగా పొదువుకుంటూ నన్ను,.

కలవరింతో, మెలుకువతో అందో
అర్ధంకాలేదు కాని,.ఆ ఆస్వాదనలో,.....


25 May 2013

ఇద్దరి మధ్య,. ఓ మంచి కవిత



మహా అయితే
ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది?
ఏం మిగులుతుంది?


***

చూస్తున్నకొద్దీ వింటున్నకొద్దీ
మనుషులు పాతబడతారు
ప్రేమ-స్నేహం-ఆత్మీయత
ఏదో కలిసినట్లే,లేదా
కలిపినట్లే ఉంటుంది


దాపరికాలు, నటనలు మొగమాటాలు
వెలసిపోయిన
మంచితనం కావచ్చు లేదా
మలినంలేనితనం కావచ్చు
మొలకెత్తి నిలబడుతుంది.


మోసం చేయనివాడు
చేయలేనివాడు
ఎప్పుడూ తలెత్తుకునే నిలబడతాడు.
ప్రేమించటం ఆదరించటం మాత్రమే
తెలిసినవాడి చేతివేళ్ళెప్పుడూ
కరుణతో స్నేహహస్తాల్ని అనిదిస్తూనే ఉంటాయి.


మోసపోతామని అనుకునే
వాడొకడు- సమర్ధుడితో
సంస్కారంతో స్నేహం చేయటానిక్కూడ
భయపడతాడు.


చేతివేళ్ళభాష,కళ్ళలో ఆత్మీయత
ఒంటరితనం తెలిసిన ఆత్మీయుడొకడు


అన్నీ తెలిసీ,సహించీ,భరించి
స్నేహితుడ్ని ప్రేమిస్తూనే ఉంటాడు.
స్నేహం కలిపినట్లు, కలిసినట్లు
మనుషులందరూ కలవలేరు.
అప్పుడప్పుడూ
అక్కడక్కడా
ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది.


అయినా మహా అయితే
ఇద్దరిమధ్య ఏం జరుగ్తుందని?


కన్నీళ్ళు,అవమానాలు,ఒంటరితనాలు
జ్ఞాపకాలు గాయాలు కలగలిసిన
'
కరచాలనం' అనే
స్పర్శ ఒకటి మిగులుతుంది.


కరచాలనంకూడా
మలినమేనంటే
మలినం మనిషి చేతులమధ్యలేదు
మనసుతెలియని కళ్ళు
కరుణతెలియని నోళ్ళుకలవాళ్ళమధ్యే


మనుషులు మరణిస్త్తుంటారు
మరణించారు
మరణిస్తారు

మనిషితనపు మహా సౌందర్యపు
స్పర్శకూడా తెలియదని
తెలుసుకునేలోపు
కొన్నిజీవితాలు ముగిసిపోతాయ్.


స్పర్శిస్తున్నయని అనుకుంటేనే
మరికొన్ని జీవితాలు 'మాయాలో
మాయమవుతాయ్,


మహా అయితే ఇద్దరిమధ్య ఏం జరుగుతుంది?
ప్రేమ మిగులుతుంది కానీ!


-
పలమనేరు బాలాజి


22 May 2013

విరామం




కవిత్వం కృతజ్ఞతలు చెప్పుకుంది,
కొంతకాలం రాయడానికి విరామం ప్రకటించినందుకు,..
నేను చేయగల మహోపకారం,
అంతకంటే మరేముంటుంది
,

21 May 2013

తొక్కలు - 4



తలతిక్క ట్యుషన్ సెంటర్లో
ఒకానొకరోజు,
హఠాత్తుగా మెలుకువవోచ్చిన ఓ సారు,..
పదోతరగతి పిల్లోడ్ని పైకి లేపి,
పదేళ్లలో నేను నీకెక్కించన చెత్తసారాన్ని,
మూడు ముక్కల్లో చెప్పవోయ్,.అన్నాడు,.
తలగీరుకుంటు ఇలా చెప్పాడు వాడు,.

మూర్ఖులు వాదిస్తారు,.
జ్ఞానులు తలాడిస్తారు,.
అటుఇటు కాని వారు అనుభవిస్తారు,.

మధ్యలోది మేలైందనుకుని,.తలడిస్తూ,.
పక్కనే ముక్కుల్లో పొక్కులు లాక్కుంటున్న,
మూడోతరగతి పిల్లని లేపి,
ఆ ముక్కల్లో, నీకెం అర్థమైందో నీ మాటల్లో చెప్పమ్మి,
అన్నాడు మాస్టారు,.

న్యూస్ చానళ్లు తప్ప
మరేం మార్చనీయని  నాన్న,
పెంపకంలో పెరిగిన పాప ఇలా చెప్పింది,.

కమ్యూనిస్ట్ వాదిస్తాడు,
మన్మోహన్ తలాడిస్తాడు,.
సోనియా,రాహుల్లు అనుభవిస్తారు,.

18 May 2013

సరే, ఇలా మొదలెడదాం



1
విలపించడం ఆగిపోయిన క్షణాలు
కొన్ని గడిచిపోయాక,
మిగిలిన కన్నీళ్లను,
చన్నీళ్లతో జాగ్రత్తగా కడుక్కుని,
అంతే ఆసక్తికరమైన మొఖంలో,
అసంపూర్ణమైన చిరునవ్వుని అద్దుకొని,
నీ ముందు నిలబడి,
తెచ్చిపెట్టుకున్న కొద్దిపాటి బింకంతో,
నేనంటానిలా,.సరే మరో సారి ప్రయత్నిస్తానని,.

2
కొద్ది విరామం తరువాత,
సంరంభాన్ని పక్కకు నెట్టి,
నేనిలా మొదలు పెడతాను,.

నిద్రపోనివ్వని రాత్రులింకా,
పూర్తిగా జ్ఞాపకాలుగా మిగలకముందే, మరవక ముందే
మళ్లీ మళ్లీ ఇలాగే అర్థంకాకుండా మిగుల్తుంన్నదుకు,.
నీ మౌనాన్ని చేధించేందుకు,
మళ్లీ మళ్లీ మాట్లాడుతుంటాను,.
దశాదిశా, తలాతోకా లేకుండా,.

3
మార్మికమైన నీ మొఖాన్ని,
ఏటవాలుగానో, నిటారుగానో పైకెత్తి,
స్థితఃప్రజ్ఞమైన నీ చూపుల్ని,
కనపడని తెంపరితనంగా,
భ్రమపడుతున్న,నా కనులలో నింపుతూ,.
అదే జాలితో,........అంతులేకుండా
మళ్లీ రాయడం మొదలుపెడతావు, నువ్వు.
నా పిచ్చితనాన్ని కూడా,
నీ అక్షరాలలోకి వంపుకుంటూ,...

4
అవే పురాతన ప్రాకృతిక పరిమాళాల్లో,
వెలుగుల్ని నింపుకున్న పసి అరిచేతుల కాంతుల్లో,
నక్షత్రాలు పూస్తున్న లేత బుగ్గల్లో,
ఫాసినేటింగ్ దివారాత్రాల్లో,
ఏకాంతాల్లో,అక్షయ మధుపాత్రల్లో,
చిట్లిపోయి,చీదరపుట్టించే
ఏవో కొన్ని పెదాల /పాదాల చివరి తడుల్లో,.
నీడనివ్వని వాక్యచ్ఛాయల్లో,
దాహం తీర్చక ఊరించే,
కవిత్వపు ఎండమావుల్లో,.
మూసపోసిన పునరుక్త పదవిన్యాస దిగ్భ్రమ భావనల్లో,.
కలాన్ని ముంచి, సుతారంగా సిరానద్దుకొని,.

కరుకు ఖడ్గఛ్చాలనంతో,
కనబడని కదన వ్యూహంతో,
సర్రున చీలుస్తూ,హృదయాన్ని,.
మాటలమూకల తోకల వంకర తీయక,.
దుఃఖాన్ని ద్విగుణీకృతం చేస్తూ,రాస్తూ,.
మళ్లీమళ్లీ రాస్తూ,కోస్తూ,...

5
ఇంకెలా చెప్పాలో  తెలియక దుఃఖిస్తానో,
నిగూఢమైన నీ రాత మర్మాన్ని,
శోధించలేక రోధిస్తానో,.
కొద్ది క్షణాల విరామానంతరమో,
పూర్తిస్థాయి విరమణాంతరమో,.
మరోసారెప్పుడన్నా, మళ్లీ చెబుతాను,.

6
ఇక, ఆ తరువాత
నీ ముఖహృదయ భావనలు,
అక్షరాలుగా మారే, ఓ నిరంతర ప్రక్రియను
తరచితరచి చూస్తూ,
మూలాలను ఎలా పట్టాలో అన్వేషిస్తూ,,
వున్న తేడాలను విశ్లేషిస్తూ,.
ఇంకేమనాలో అర్థంకాక, ఇలా అంటానిప్పుడు,..
డెఫనెట్లీ, సమ్ థింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ