Pages

2 July 2015

నాన్సెన్స్ఒక అర్థరాత్రి
పలచటి వెలుతురు లాంటి మెలకువలో
కనురెప్పలపై  పెదవుల బరువుతో
తెరవబడని కనుల బాధ,
తెలుసో లేదో నీకు.

వెంటాడే నీడలాంటి గాయంలో
ఘాటైన కారం లాంటి వాక్యపు రుచి
ఎరుగుదువో లేదో నువ్వు.

మూతులపై ముచ్చటగా
విరబూసే నవ్వుల మతలబులో
రహస్య విషాద
విష లోకపు తీరని దిగుల్లు
ఓదార్చే గుండె తడిని
స్పర్శించావో లేదో నువ్వు.


2 comments:

  1. ఇంత ఆర్ద్రతతో రాస్తే తప్పక వింటుందండి.

    ReplyDelete
    Replies
    1. చాలా కాలానికి బ్లాగ్ లో ఓ కామెంట్,.. థాంక్యూ పద్మార్పిత గారు.

      Delete