( ఇవి కేవలం సరదాకి మాత్రమే, ఎవరిని ఉద్ధేశించినవి కావు)
చిన్నకవులనుంచి పెద్ద కవులదాక
ఎక్కడెక్కడ చూడు కాఫీకేట్లందరు
కవుల క్రింది నలుపు కవులకే తెలుసు
గురివింద హేళి, e కవుల
కేళి.
పాదవ్యర్థాలు :కాఫీకేట్లు = కాపీ కొట్టెే
కేటుగాళ్లు
4/6/15
బేకారీలు
ఎక్కడెక్కెడో రగిలి
లోపలంతా కాల్తే కాని
కవితా మంట ఎగసిపడదంటూ,
ఉక్రోఖ్యానం మొదలెట్టానో లేదో,
బాగా కాలి,
బూడిదయ్యాక చెప్పు
అప్పుడొస్తా,
అంటూ ఉడాయించాడు, వాడు.
ఫుట్ నోట్స్* ఉక్రోఖ్యానం ఉక్రోషంతో కూడిన వ్యాఖ్యానం
3/7/15
బేకారీలు
తనడుగుతుంది
నీవు రాసే ప్రతి అక్షరంలో
కనిపిస్తున్నది ,
నేనే కదా అని.
నిజానికి అబద్దానికి మధ్య
మౌనంగా నేను .
1/7/15
బేకారీలు
కాళ్లు నాకుతూ
కూర్చుంటాయేంతసేపైన
బొచ్చెలో వేసే బొమికల కోసం.
మొరుగుడంతా
ఎదుటి ముఖాల పైనే.
అంతకంటే ఆశించకు
పెంపుడు కుక్కలవి.
గుర్తు చేసి బాధించకు
కోల్పోయిన జీవితాన్ని.
30/6/15
బేకారీలు
గోడకు కొట్టిన పిడకైనా
కాలానికి ఎండి రాలిపోయాక
ఇంధనమై మండుతుంది.
కవిత్వానికి కరుచుకుపోయాక
కుళ్లిపోతారు అక్కడే
కవులెందుకో.
26/6/15
బేకారీలు
పేరు, పోయమ్స్ లో
ప్రాధాన్యత దేనికిస్తావ్ అని
మళ్లి అడిగాడతను.
కీర్తీ, కవిత్వంలో
ప్రాధాన్యత దేనికిస్తావ్
అని మళ్లీ అడిగాడతను.
ఖ్యాతి/ పేరు కోసం వేసే
కుక్క బిస్కత్తులు
కవితలని
ఎలా చెప్పను.
బేకారీలు
అతనన్నాడు
తల ఎత్తకు
తగ్గి, తగ్గి, తగ్గితేనే గెలవగలవని.
నవ్వొస్తుంది
చచ్చాక గెలుపెందుకని.
No comments:
Post a Comment