మళ్లీ అలాగే చెప్పుకుందాం
అదీ ఏ జన్మానిదైనా అంతేకదా!
కొన్ని రాకల వెనుక కారణాల మీద
ఎన్ని పిచ్చి గీతలు గీసుకున్నా
మధుర గీతాలు రాసుకున్నా
ఎవడికొరిగేది ఏంటో ఎవడు
నిర్థారిస్తాడు?
ఒక అశోకుని లెక్క యుద్ద వీరుడై
దుఃఖపు దారిని ఎన్నుకుని
శవాల కుప్పల మధ్య కుములుతున్న
జనుల గుండెల రగిలింతల గాయమైన
దేశపు దేహాల సందోహాల సందేహ హేల
భరిస్తూ.
తధాగతా, మళ్లీ ప్రేమ గురించే మాట్లాడు
ఒక మంత్రగాడి మాదిరి ఈ జనుల చెవుల్లో
పదే పదే తడుతు హృదయపు తలుపులను.
లంజల దిబ్బల మతపూతలు మట్టికొదిలి.
యేసు దేవా, ముళ్లకిరీటపు రక్తదాహాల
నేల
ఇంకా అలాగే చెర్నాకోలై చెలరేగుతూనే
వుందే,
పొరుగువాడి మిస్సైల్ల దాడికి చెదిరిన
అవయపు చెత్తకుప్పల
శత సహస్ర సంప్రోక్షణల్లో
నిరంతర విషాద స్తోత్రమై, జీవితం.
ఇక చెప్పడానికి, ఏం వుంటుది ప్రవక్తా!
చీకట్లలో నెలవంకవై నువ్వు చూస్తూనే
వున్నప్పుడు.
chaalaa baagundi Bhaskarji..
ReplyDeleteKcube Varma సర్,. ధన్యవాదాలు.
Deleteచాలా బారా రాశారు భాస్కర్ జి
ReplyDeletethank you,.Meraj Fathima garu.
Delete