Pages

1 July 2014

పరామీటర్స్


తేలిపోతున్న మేఘాలు
మోసుకెళ్తున్న సందేశాలను
చెవులి రిక్కించి వింటూ,
కురిస్తున్నచివరి చినుకుల
తుంపర్లతో తడుస్తున్న దేహంతో
అప్పుడిక కవి
అరమోడ్పు కన్నులతో
ఇలా మొదలెడతాడు

అస్పష్టంగా నీలో కొన్ని
నదులు ప్రవహించాలి.
కొన్ని పూలు వికసించాలి
కొన్ని చెట్లు చిగురించాలి
ప్రవహిస్తున్న భావాల ఉరవడికి
అడ్డుకట్టలు కట్టుకోవాలి
ఎప్పుడు ఎంతెంత వదలాలో ఉద్వేగాన్ని
ఆ లెక్కలు నీకు తెలిసుండాలి.

శోభనిచ్చే పూలను
ఆచితూచి ఎంచుకోవాలి.
ఒకానొక అలౌకికత్వంతో
పదమాలలు అల్లుకోవాలి.
సమయ సందర్భాలను చూసి
ఇదే నా కవిత్వమని చాటుకోవాలి
అంటూ చిన్నగా నవ్వాడు కవి.

ఈలోపు లోపలున్న అకృత్యుడు బయటకొచ్చాడు,
నేనూ చెబుతాను కవిత్వం గురించి కొన్ని మాటలంటూ,.

గొంతులో అడ్డం పడ్డ ఖఫాన్ని
ఖాండ్రించి బలంగా ఉమ్మడమూ కాదు.

అజీర్ణమైన భావాన్ని
చెవులు మూసుకుని
బలవంతంగా కక్కడమూ కాదు.,

గొంతు కూర్చొని రానిదాన్ని
గట్టిగా ముక్కడమూ కాదు,.కవిత్వమంటే,.
అంటూ పడిపడి నవ్వాడు వాడు.
ఇప్పుడు నువ్వు రాస్తున్నదదే కదా అంటూ,.



2 comments:

  1. కవిత్వం గురించి కవి భావాలు,అకృత్యుడి భావాలూ రెండూ బాగున్నాయండీ...

    ReplyDelete
  2. హ హ హ ..కవిత్వానికి కవిత్వం సెటైర్ వేసినట్లుంది ..

    ReplyDelete