నాటకీయత
చేర్పులేకుండా
సత్యమైనా ఇక్కడ
పొర్లుదండాలు పెట్టాల్సిందే.
వాస్తవాన్ని
వాస్తవంగా కాక
కాస్త
వాపునద్దుకుని
పోపులాగా ఘమాయించాల్సిందే.
అబ్బే,
అప్పటిదాకా ఎవడికీ
ఏది తలకెక్కదు.
ఒరే బండరాయా
చెప్పిచెప్పి,
నోరెండిపోతున్నాది కదారా
వున్నదున్నట్టే చెప్పేటోడికేం వుంటాదిరా, విలువ.
మసాలాలు
లేకుండా చికెనీలు
సెంటిమెంట్
పండకుండా కవిత్వాలు
కళ్లు మండకుండా
తలస్నానమెందిరా, భయ్.
బాగుందండి
ReplyDelete