ఎంగలి
బీడి ముక్కలను
పోగుచేసుకొని
జేబులో
దాచుకొని
అప్యాయంగా
తడుముకునే వాడికి
వాటి
విలువ తెలిసే వుండాలి.
తాగిపారేసిన
ఖాళీసీసాలలో మిగలిన
చివరి
చుక్కలను
అదే
పనిగా
అరచేతిలోకి
తట్టుకొని
నాలికతో
రుచిచూసేవాడికి
అక్కడేదో
ఆనందం దొరికే వుండాలి.
పనికిమాలిన
ఊహలతో
కొట్లాడి,
కొట్లాడి
కాలం
కుంపటిలో కాళ్లు కాల్చుకుని
కవిత్వమై
మిగలేవాడికి కూడా
ఖచ్చితంగా
సురామయమైన రుచేదో
వ్యసనమై
మిగలేవుండాలి.
విభిన్నదృశ్యాల
వైవిధ్యాలనో,
వైరుధ్యాలనో విశ్లేషించుకుంటూ
సహజాతాలతో
తృప్తిచెందేవాడికి,
అంతర్
ప్రపంచాల మధ్య
అనువైన
వాతావరణం ఒకటి
వెల్లివిరుస్తూనే
వుండివుండాలి.
సృజనాత్మక
సరాగాలను మీటుకుంటూ.
ప్రతిది
మనకు అవగతము కాకపోవచ్చునుగాని.
No comments:
Post a Comment