Pages

29 June 2013

సాకులు



పరుగులెత్తేవాడే,
పడిపోతాడని భ్రమపడమాక,.

నిలకడగా నిలబడ్డవాడే,
వున్నట్టుండి, ఒక్కసారిగా
కుప్పకూలిపోవచ్చు,.కాలం కలిసిరాకపోతే,....

తిరుగులేకుండా దూసుకుపోతున్నవాడే,
గమ్యాన్ని చేరుకుని,
జీవితాన్ని ఆస్వాదిస్తాడనుకోమాక,.

చడిచప్పుడు లేకుండా,
నిశ్చలంగా వుండేవాడు కూడా,.
అంతులేని ఆనందాలను,
జుర్రుకుంటు వుండి వుండవచ్చు,.

కాస్తంత సంతృప్తిని తోడుంచుకొని,..

6 June 2013

స్వజాలి



ఎంత ప్రగాఢతను పుష్పిద్దామనుకుంటానో,
అంత పేలవంగా వాడిపోతుంటాను, ,.

జీవనదుల్ని పారించాలనుకుంటాను,
చిన్న ఊటనైన దక్కించుకోలేక
సిగ్గుపడుతుంటాను నేను,.

చండప్రచండమై ప్రజ్వరిల్లాలనుకుంటాను,
వెలిగించుకోలేని దీపమై,
చీకట్లో మిగులుతుంటాను, ,.

జీవితాన్నే కవిత్వంగా మార్చాలనుకొంటాను,
చిన్న వాక్యాన్ని కూడా చేజిక్కించుకోలేక,
దిగులుపడుతుంటాను నేను,.


అలజడులు తగ్గుతున్నకొద్ది,
ప్రతిబింబం స్పష్టమవుతుంది,.