Pages

4 February 2012

చెదిరిన బాల్యం(కవిత - 3)

చెదిరిన బాల్యం

తట్ట బుట్ట పలుగు పార,
నాకేం తెలుసు పలక,బలపం?

సైకిల్ ట్యూబూపాలిష్ డబ్బా,
నాకేం తెలుసు  ఎ,బిసి,డి?

కుమ్మరి మట్టిఇటుకల బట్టి,
నాకేం తెలుసు బడి గుడి?

అమ్మది కష్టంనాన్నది కష్టం
కొద్ది సేపు పని మానితే,
ఎంత కష్టం ఎంత నష్టం.

టీచర్ (కవిత - 2)



మా సార్

ముళ్ళ పొదల్లో  ఇరుక్కున్న
నా ఆలోచనలకు
వెలుగు బాటను చూపి ,
తానక్కడే మిగిలి పోతాడు.

తన స్వప్నాల్ని
నా బుర్ర లోకి నెట్టి
నిశ్శబ్ధం గా  నలిగి పోతాడు.

నా జీవితాన్ని
నా చేతుల్లో పెట్టి
నా వంక చూడకుండానే
వెళ్లి పోతాడు.

నా లక్ష్యంనా మార్గం,
నా స్వప్నంనా జ్ఞానం,
అన్నీ  తానై,
మౌనం గా మురుస్తూ ,
మనసులో మెరిసిపోతాడు.
ఓ జ్ఞాపకం గా మిగిలి పోతాడు.

3 February 2012

బడి అంటే..... (కవిత - 1)


బడి అంటే యంత్రం కాదు,
అది తరతరాల శోధిక.
బడి అంటే మంత్రం కాదు,
అది భవిషత్కాల గీతిక.
బడి అంటే భవనం కాదు,
అదీ .............
జ్ఞానకాంతుల దీపిక.
మానవత్వపు మాలిక.
విజ్ఞానపు వేదిక.

అవీ ఇవీ - 1

 నా మూర్ఖత్వం
-----------------------------------------------------------

జ్ఞానం , అజ్ఞానం ఒకే నాణెం కు రెండు ముఖాలు.


నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకోవడానికి

 కొద్దిపాటి జ్ఞానం చాలు,

నేను జ్ఞానిని అని చెప్పుకోవడానికి

  చాల మూర్ఖత్వం కావాలి.

మూర్ఖత్వం  జ్ఞానానికి వత్తి లాంటిది.

జ్ఞానానికి చివరిమెట్టు మళ్ళీ అజ్ఞానమే.

మూర్ఖత్వమే బలం - జ్ఞానమే బలహీనత.

ఎంత ఆశ్చర్యం !

నా జ్ఞానం పక్కనోళ్ళకి 

నా మూర్ఖత్యం నాకు సహాయం చేసింది.